IPL 2025: ఆ రూల్ తీసుకొస్తే ఐపీఎల్ మరింత ఆసక్తికరంగా మారుతుంది: మాజీ క్రికెటర్

IPL 2025: ఆ రూల్ తీసుకొస్తే ఐపీఎల్ మరింత ఆసక్తికరంగా మారుతుంది: మాజీ క్రికెటర్

క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఐపీఎల్ 2025 షెడ్యూల్ వచ్చేసింది. 18వ ఎడిషన్ షెడ్యూల్‌‌ను గవర్నింగ్ కౌన్సిల్ ఆదివారం(ఫిబ్రవరి 16) విడుదల చేసింది. మరో నెల రోజుల్లో అభిమానులని అలరించడానికి 10 జట్లు సిద్ధంగా ఉన్నాయి. ఈ టోర్నీ మార్చి 22న ప్రారంభమై మే 25న జరిగే ఫైనల్‌తో ముగియనుంది. కోల్ కతా నైట్ రైడర్స్ డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగుతుంది. తొలి మ్యాచ్‌ మార్చి 22న డిఫెండింగ్‌ ఛాంపియన్ కోల్‌కతా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరగనుంది. ఐపీఎల్ షెడ్యూల్ రిలీజ్ ఐన తర్వాత టీమిండియా మాజీ క్రికెటర్ ప్రముఖ కామెంటేటర్ ఆకాష్ చోప్రా ఒక సలహా ఇచ్చాడు. 

మాజీ భారత ఓపెనర్ ఆకాశ్ చోప్రా లీగ్‌లోని పాయింట్ల విధానానికి సంబంధించి ఒక సూచన చేశాడు. బాగా ఆడి.. భారీ విజయం సాధించిన జట్టుకు బోనస్ పాయింట్ ఇవ్వాలని తన అభిప్రాయాన్ని చెప్పాడు. బోనస్ పాయింట్ల రూల్ తీసుకొని వస్తే ఐపీఎల్ లో మజా వస్తుందని ఆకాష్ చోప్రా వాదించాడు. నెట్ రన్ రేట్ మంచిదే అయినప్పటికీ బోనస్ పాయింట్ ఇవ్వడం వలన మరింత లాభం చేకూరుతుందని ఈ కామెంటేటర్ సూచించాడు. ప్రస్తుతం పాయింట్ సిస్టమ్ పరంగా రూల్స్ చాలా ఈజీ. గెలిచిన జట్టుకు రెండు పాయింట్లు లభిస్తాయి. ఫలితం రాకుంటే రెండు జట్లకు చెరో పాయింట్ లభిస్తుంది.

ALSO READ | Ajinkya Rahane: ఫైనల్లో బాగా ఆడినా తప్పించడం బాధించింది.. సెలక్టర్లపై రహానే విమర్శలు

మొత్తం 74 మ్యాచులు 65 రోజులపాటు జరుగుతాయి. లీగ్ దశలో ఒక్కో జట్టు 14 మ్యాచ్‌ల్లో తలపడనుంది. ఇందులో 7 హోమ్ గ్రౌండ్‌లో.. మరో 7 ప్రత్యర్థి వేదికల్లో జరగనున్నాయి. తొలి మ్యాచ్‌ మార్చి 22న డిఫెండింగ్‌ ఛాంపియన్ కోల్‌కతా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరగనుండగా.. ఆ మరుసటి రోజే(మార్చి 23) హైదరాబాద్ - రాజస్థాన్‌ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదిక. ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియం మొత్తం 9 మ్యాచ్‌లకు ఆతిథ్యమివ్వనుంది. ఇందులో లీగ్ మ్యాచ్‌లు 7 కాగా.. ప్లేఆఫ్స్‌ మ్యాచ్‌లు 2 ఉన్నాయి.