
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా భారత క్రికెట్ లో ప్రస్తుతం అత్యంత అనుభవజ్ఞులైన ఆటగాళ్లు. వీరి వయసు 35 దాటడం.. పెద్దగా ఫామ్ లో లేకపోవడంతో వీరి రిటైర్మెంట్ పై వార్తలు వస్తున్నాయి. ఈ సమయంలో భారత మాజీ క్రికెటర్.. ప్రముఖ కామెంటేటర్ ఆకాష్ చోప్రా ఈ త్రయంపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఫిబ్రవరి 19న ప్రారంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీ భారత స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజాలకు చివరి ఐసీసీ ఈవెంట్ అవుతుందని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డారు. ఈ ముగ్గురు సీనియర్ ఆటగాళ్ళు 2027 వన్డే వరల్డ్ కప్ లో కనిపించకపోవచ్చని చోప్రా షాకింగ్ కామెంట్స్ చేశాడు.
ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. "నేను బరువెక్కిన హృదయంతో చెబుతున్నాను. రోహిత్, కోహ్లీ, జడేజాలకు ఇదే చివరి ఐసీసీ టోర్నీ అవుతుంది. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ జరుగుతుంది. భారత్ ఫైనల్ కు క్వాలిఫై కాలేదు కాబట్టి ఆడలేదు. 2026 లో జరగబోయే టీ20 వరల్డ్ కప్ కు ఈ ముగ్గురు రిటైర్మెంట్ ప్రకటించడంతో ఆడే అవకాశం లేదు. 2027 వన్డే వరల్డ్ కప్ కు ఇంకా చాలా సమయం ఉంది. అప్పటివరకు వీరు ముగ్గురూ కొనసాగడం కష్టమే. 2027 నాటికి ప్రపంచం చాలా భిన్నంగా కనిపిస్తుంది. కాబట్టి ఇదే ఈ ముగ్గురికి చివరి ఐసీసీ టోర్నీ అని నేను భావిస్తున్నాను". అని చోప్రా అన్నారు.
ప్రస్తుతం రోహిత్, కోహ్లీ, జడేజా ముగ్గురూ వన్డే, టెస్ట్ ఫార్మాట్ ఆడుతున్నారు. ఇప్పటికీ రోహిత్ శర్మ టెస్ట్ కెరీర్ దగ్గర పడింది. వన్డేల్లోనూ ఎక్కువ కాలం కొనసాగే అవకాశాలు లేనట్టు కనిపిస్తున్నాయి. మరోవైపు కోహ్లీ పేలవ ఫామ్ తో ఇబ్బంది పడుతున్నాడు. గత నాలుగేళ్లలో వన్డే వరల్డ్ కప్ మినహాయిస్తే కోహ్లీ గొప్పగా ఆడిన మ్యాచ్ లు చాలా తక్కువ. పదే పదే విఫలమవుతూ జట్టుకు భారంగా మారుతున్నాడు. జడేజా రెండు ఫార్మాట్ లలో ఆల్ రౌండర్ గా రాణించాలంటే కష్టం. పైగా అక్షర్ పటేల్, సుందర్ అతనికి గట్టి పోటీనిస్తున్నారు. వీరు మరో ఐసీసీ టోర్నీ ఆడాలంటే 2027 వన్డే వరల్డ్ కప్ లోనే సాధ్యపడుతుంది. కానీ అప్పటివరకు వీరు కొనసాగడం ఆకాష్ చోప్రా చెప్పినట్టు నిజంగానే కష్టంగా కనిపిస్తుంది.
Agree With Aakash Chopra?#IndianCricket #TeamIndia #ChampionsTrophy #RohitSharma #RavindraJadeja #ViratKohli pic.twitter.com/dyHSeikxUD
— CRICKETNMORE (@cricketnmore) February 15, 2025