‘ఆకాశం’లో అశోక్ సెల్వన్ డిఫరెంట్ లుక్

‘ఆకాశం’లో అశోక్ సెల్వన్ డిఫరెంట్ లుక్

‘ఆకాశం’ మూవీ టీజర్ ను స్టార్ డైరెక్టర్ హ‌రీశ్ శంక‌ర్ విడుద‌ల చేశారు. ఇందులో హీరోగా అశోక్ సెల్వన్, హీరోయిన్లుగా రీతూ వర్మ, అపర్ణ బాల మురళి, శివాత్మిక రాజశేఖర్ న‌టిస్తున్నారు. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ ‘వ‌యాకామ్ 18’, ‘రైజ్ ఈస్ట్ బ్యాన‌ర్స్’ సంయుక్తంగా ఆర్‌.ఎ.కార్తీక్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. హీరోయిన్ వాయిస్‌తో ఆకాశం మూవీ టీజ‌ర్ మొద‌ల‌వుతుంది. ‘‘మ‌న‌సు ఉల్లాసంగా ఉన్నప్పుడు మర్చిపోవాలనుకున్న విషయాలు కూడా ఇంకా అందంగా గుర్తొస్తాయి క‌దూ’’ అని హీరోయిన్ ఎంతో హృద్యంగా చెబుతుంది. ఈక్రమంలో హీరో అశోక్ సెల్వన్ డిఫరెంట్ లుక్ లో కనిపిస్తాడు. హీరోకు, ముగ్గురు హీరోయిన్స్‌ కు మధ్య సాగే సన్నివేశాలు అలరిస్తాయి.  

చివర్లో బ్యాక్ గ్రౌండ్ లో ‘ఆకాశం’ టైటిల్ పాట‌ వినిపిస్తుంది. లీలావ‌తి కుమార్ సినిమాటోగ్రఫీ, గోపీ సుంద‌ర్ సంగీతం ఈ స‌న్నివేశాల‌కు మ‌రింత అందాన్ని అద్దాయి. వెరసి, ‘ఆకాశం’ మంచి ప్రేమ క‌థా చిత్రమని అర్ధమవుతుంది. ఈ  సినిమా టీజర్ లో నటులు పలికించిన ఎమోష‌న్స్.. దానిపై సినీ ప్రియుల ఆసక్తిని మరింత పెంచేలా ఉన్నాయి. ఇంతకుముందే విడుదలైన హీరో అశోక్ సెల్వన్, ముగ్గురు హీరోయిన్ల లుక్ పోస్టర్లు ప్రేక్షకులను మెప్పించాయి. ఈ మూవీని న‌వంబ‌ర్‌లో విడుదల చేయడానికి నిర్మాతలు స‌న్నాహాలు చేస్తున్నారు.