వైసీపీకి బిగ్ షాక్ : పార్టీ పదవులకు ఆళ్ల నాని రాజీనామా

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి.. జగన్ నమ్మిన బంటుగా ఉన్న ఆళ్ల నాని రాజీనామా చేశారు. తన రాజీనామాను పార్టీ అధ్యక్షులు జగన్ కు పంపించారు. 2024, ఆగస్ట్ 9వ తేదీ.. జగన్ నంద్యాల పర్యటనలో ఉన్న సమయంలోనే.. ఆళ్ల నాని తన రాజీనామాను ప్రకటించటం సంచలనంగా మారింది. 

ఆళ్ల నాని జగన్ ప్రభుత్వంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పని చేశారు. డిప్యూటీ సీఎం హోదా ఇచ్చారు జగన్. జగన్ ప్రభుత్వంలో మంచి గుర్తింపు పొందారు ఆళ్ల నాని. పార్టీకి గట్టి వాయిస్ వినిపించారు. పార్టీలోని అన్ని పదవులకు రాజీనామా చేయటం సంచలనంగా మారింది. ఊహించని పరిణామంగా చెబుతున్నారు పార్టీ నేతలు. 

ప్రస్తుతం ఆళ్ల నాని.. ఏలూరి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా.. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం ఇంచార్జిగా ఉన్నారు. భవిష్యత్ లో రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకోవటం వల్ల.. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారాయన. ఆళ్ల నాని రాజీనామా అనేది వైసీపీ క్యాడర్ లోనూ చర్చనీయాంశం అయ్యింది. అది కూడా జగన్ నంధ్యాల పర్యటన సమయంలోనే తీసుకోవటం ద్వారా.. పలు రకాలుగా చర్చ నడుస్తుంది.