సాధారణంగా ఆసీస్ గడ్డపై టెస్టు మ్యాచ్ అంటే ప్రత్యర్థి బ్యాటర్లు బెంబేలెత్తిపోతారు. అత్యద్భుతంగా ఆడితే తప్ప ఎంతటి స్టార్ బ్యాటర్ అయినా స్వదేశంలో కంగారూల బౌలింగ్ దెబ్బకు బలి కావాల్సిందే. ఇక ఆసియా జట్లయితే టెస్టుల్లో ఆసీస్ గడ్డపై రాణించడం శక్తికి మించిన పని. అయితే వీటన్నిటిని పటాపంచలు చేస్తూ ఒక టెయిలెండర్ కంగారులకు కొరకరాని కొయ్యలా తయారయ్యాడు. చివరి వికెట్ కు భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఆసీస్ ను కంగారు పెట్టాడు. ఇంతకీ అతడెవరో ఇప్పుడు చూద్దాం.
ఆస్త్రేలియా పర్యటనలో పాక్ మూడు టెస్టుల సిరీస్ ఆడాల్సి ఉంది. ఇందులో భాగంగా తొలి రెండు టెస్టుల్లో ఓడి సిరీస్ కోల్పోయిన పాక్.. నేడు(జనవరి 3) సిడ్నీ వేదికగా మూడో టెస్టు ఆడుతుంది. ఈ టెస్టులో మొదట బ్యాటింగ్ చేసిన పాక్.. ఒక దశలో 227 పరుగులకే 9 వికెట్లను కోల్పోయి తక్కువ స్కోర్ కే పరిమితమయ్యేలా కనిపించింది. అయితే పాక్ బౌలర్ అమీర్ జమాల్ బ్యాట్ తో చెలరేగాడు. బౌండరీల మోత మోగిస్తూ ఆసీస్ బౌలర్లందరకూ చుక్కలు చూపించాడు. 97 బంతుల్లో 82 పరుగులు చేసి ఆసీస్ కు దడ పుట్టించాడు.
జమాల్ ఇన్నింగ్స్ లో 9 ఫోర్లు, 4 సిక్సులు ఉండడటం విశేషం. ఈ బౌలర్ వీరోచిత ఇన్నింగ్స్ తో పాక్ 313 పరుగులకు ఆలౌటైంది. మీర్ హంజాతో కలిసి 86 పరుగులు జోడించి పాక్ కు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. జమాల్ ఈ ఇన్నింగ్స్ తో ఆస్ట్రేలియా గడ్డపై 9 వ స్థానంలో అత్యధిక పరుగులు చేసిన పాక్ ఆటగాడిగా అరుదైన రికార్డ్ తన పేరిట లిఖించుకున్నాడు. పాక్ ఇన్నింగ్స్ లో స్టార్ బ్యాటర్ రిజవాన్ 88 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు.
Aamer Jamal -- batting at number 9, playing his first Test series, against Starc, Cummins, Hazelwood, Lyon in Australia and scored a fifty. ? pic.twitter.com/FzlonuFE15
— Johns. (@CricCrazyJohns) January 3, 2024