బాలీవుడ్ హీరోలందరు ఎక్కువగా మన సౌత్ డైరక్టర్లపై ఆసక్తి చూపిస్తున్నారు. మన తెలుగు సినిమాలు బాలీవుడ్ బాక్సాఫీస్ కలెక్షన్స్ తో దుమ్ములేపుతున్నాయి. అంతేకాకుండా మన దర్శకుల మేకింగ్ స్టైల్ నచ్చడంతో.. బాలీవుడ్ హీరోలు తెలుగు డైరక్టర్ల వైపు చూస్తున్నారు. ఇప్పటికే షారుఖ్ ఖాన్, అట్లీతో జవాన్ తీయాగా.. సందీప్ రెడ్డి వంగా యానిమాల్ సినిమాతో మన మేకింగ్ సత్తా ఎంటో చూపించారు. దాంతో ఒక్కొక్కరు మన తెలుగు దర్శకులతో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. ఇదిలా ఉంటే
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ (Aamir Khan) చూపు మన తెలుగు డైరెక్టర్ పై పడిందని టాక్. అమీర్ ఖాన్ చివరగా 2022 ఆగస్టులో రిలీజైన లాల్ సింగ్ చడ్డా సినిమాతో భారీ డిజాస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇపుడు ఈ హీరో ప్రస్తుతం వంశీ పైడిపల్లి (Vamshi Paidipally) దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్లు సొషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది.
ఇప్పటికే డైరక్టర్ వంశీ పైడిపల్లి చెప్పిన కధ నచ్చి అమీర్ ఖాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఈ సినిమాని నిర్మాత దిల్ రాజు నిర్మిస్తారని కూడా మరో వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. ఈ లేటెస్ట్ కాంబోపై త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇదే కనుక నిజమైతే మరో తెలుగు డైరక్టర్ బాలీవుడ్ లో జెండా పాతినట్టే అన్నమాట.
అయితే ఇప్పటి వరుకు డైరక్టర్ వంశీ పైడిపల్లి మన టాలీవుడ్ లో ఆరు సినిమాలు తీశాడు. వాటిలో 5 సినిమాలు దిల్ రాజు బ్యనర్ లోనే రూపొందించడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ వీరిద్దరు మరో సినిమాతో కలవబోతున్నారని తెలుస్తుంది.
వంశీ పైడిపల్లి తన చివరి సినిమా విజయ్ తో వారసుడు (Varasudu) తెరకెక్కించాడు. ఆ తర్వాత మన టాలీవుడ్ స్టార్లతో సినిమా తీయాల్సింది. కాకపోతే మన హీరోలందరు వేరే ఫ్రాజెక్ట్స్ తో బిజీగా ఉండటంతో చాన్సులు కరువు అయ్యాయి. అందుకే తన కథని మొదట బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ తో సినిమా చేస్తున్నాడని ప్రచారం జరిగింది. అయితే, ఇపుడా ప్రాజెక్ట్ లో అమీర్ ఖాన్ నటిస్తున్నాడు.