ఇది నిజమేనా: అక్కడ కూలీకి సిద్దమైన స్టార్ హీరో!

ఇది నిజమేనా: అక్కడ కూలీకి సిద్దమైన స్టార్ హీరో!

రజినీకాంత్,లోకేష్ కనగరాజ్ కాంబోలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ "కూలీ" (Coolie). ఈ మూవీని సన్ పిక్చర్స్ పథకంపై కళానిధి మారన్  నిర్మిస్తున్నారు. నాగార్జున, శృతి హాసన్, ఉపేంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 

లేటెస్ట్ అప్డేట్ మేరకు.. ఈ మూవీలో ఒక కీలక పాత్ర కోసం బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ ను సెలెక్ట్ చేశారట మేకర్స్. కానీ ఇప్పటివరకు చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. 

అయితే, ఇటీవలే కూలీ కొత్త షెడ్యూల్ లోకి రజినీ ఎంట్రీ ఇచ్చారు. ఈ షెడ్యూల్లో రజినీతో పాటు అమీర్ ఖాన్ కూడా పాల్గొంటారని సమాచారం. జైపూర్లో జరిగే ఈ షెడ్యూల్లో అమీర్ ఖాన్ అడుగు పెట్టినట్లు టాక్. దాదాపు పది రోజుల పాటు సాగే షెడ్యూల్‌ ఇదని.. దీనిలో భాగంగా రజినీ మరియు అమీర్ ఖాన్ లపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తుంది.

ALSO READ : సినిమాకు భాషా పరమైనహద్దులు లేవు.. తెలుగులోకి మలయాళ సూపర్ హిట్ మూవీ

29 సంవత్సరాల క్రీతం వీళ్లిద్దరి కలయకలో ‘ఆటంక్‌ హై ఆటంక్‌’ అనే మూవీ వచ్చింది. మళ్ళీ ఇన్నాళ్లకు వీరు కలిసి నటిస్తున్నారు. అయితే, ఇప్పటివరకు ఈ విషయం గురించి చిత్రయూనిట్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోవడం గమనార్హం. ఈ నెల 12 న రజినీకాంత్ పుట్టిన రోజు సందర్బంగా కూలి నుంచి ట్రైలర్ రిలీజ్ చేసే అవకాశం ఉంది.