బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ సినిమాలపట్ల డెడికేషన్ తో ఉంటాడు. ఈ క్రమంలో పాత్రకి దగ్గట్టుగానే తన బాడీ, కాస్ట్యూమ్స్ ఇలా అన్నింటిలో పర్ఫెక్ట్ గా ప్లాన్ చేస్తుంటాడు. అయితే గత కొన్ని రోజులుగా అమీర్ ఖాన్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఫొటోల్లో అమీర్ ఖాన్ మాసిన, చిరిగినా దుస్తులు ధరించి, గడ్డం, జుట్టు పెరిగిపోయి పూర్వంలో గుహలో నివసించే వ్యక్తిగా కనిపించాడు. దీంతో ఒక్కసారిగా ఈ ఫోటోలపై సోషల్ మీడియాలో తీవ్ర ఆసక్తి నెలకొంది.
ఇంతకీ అసలు విషయం ఏమిటంటే అమీర్ ఖాన్ ప్రముఖ కూల్ డ్రింక్స్ తయారీ సంస్థ థంబ్స్ అప్ సంస్థ నుంచి వస్తున్న కొత్త సాఫ్ట్ డ్రింక్ ఛార్జ్డ్ బై థమ్స్ అప్ యాడ్ కోసం కేవ్ మెన్ లుక్ లో నాట్ నటించాడు. దీంతో ఈ యాడ్ ని ప్రమోట్ చేసేందుకు కేవ్‌మ్యాన్ లుక్ ముంబై నగర వీధుల్లో తిరిగాడు. అయినప్పటికీ ప్రజలు అమీర్ ఖాన్ ని గుర్తు పట్టలేదు. అయితే ఇటీవలే థంబ్స్ అప్ సంస్థ ఈ యాడ్ ని యూట్యూబ్ లో రిలీజ్ చేశారు. దీంతో అమీర్ ఖాన్ కేవ్ మెన్ లుక్ పై సప్సెన్స్ వీడింది. కొందరు నెటిజన్లు ఈ వీడియో యాడ్ పై స్పందిస్తూ అమీర్ ఖాన్ డెడికేషన్ కి హ్యాట్సాఫ్ అంతో కామెంట్లు చేస్తున్నారు.
ఈ విషయం ఇలా ఉండగా రెండేళ్ల క్రితం అమీర్ ఖాన్ "లాల్ సింగ్ చద్దా" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఈ సినిమా పెద్దగా అలరించలేదు. దీంతో ఈసారి అమీర్ సినిమా స్టోరీస్ పై దృష్టి సారించాడు. గేర్ మార్చి డిఫరెంట్ కాన్సప్ట్స్ తో ఆడియన్స్ ని అలరించేందుకు సిద్దమవుతున్నాడు. ప్రస్తుతం తమిళ్ ప్రముఖ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ డైరెక్ట్ చేస్తున్న "కూలీ" సినిమాలో గెస్ట్ అప్పియరెన్స్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో మెయిన్ హీరోగా సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్నాడు. అలాగే బాలీవుడ్ డైరెక్టర్ ఆర్.ఎస్ ప్రసన్న దర్శకత్వం వహిస్తున్న "సితారే జమీన్ పర్" సినిమాలో నటిస్తున్నాడు.