యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసిన స్టార్ హీరో.. నిజాలు, కథలు బయటికొస్తాయంటూ..

యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసిన స్టార్ హీరో.. నిజాలు, కథలు బయటికొస్తాయంటూ..

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ ఈమధ్య తన ఫ్యాన్స్ కి సోషల్ మీడియాలో బాగానే అందుబాటులో ఉండేందుకు సంచలన నిర్ణయం తీసుకున్నాడు. సొంతంగా యూట్యూబ్ ఛానెల్ ని స్టార్ట్ చేశాడు. ఇందులో భాగంగా "అమీర్ ఖాన్ టాకీస్" అనే యూట్యూబ్ ఛానెల్ ని ప్రారంభించినట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపాడు. అంతేకాదు తన మొదటి వీడియో ని కూడా షేర్ చేశాడు.

ఈ వీడియోలో ఎన్నో ఏళ్లుగా తాను యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసి ఆడియన్స్, ఫ్యాన్స్ తో ఇంటరాక్ట్ అవ్వాలనుకున్నానని కానీ ఇప్పటికి కుదిరిందని చెప్పుకొచ్చాడు. అయితే కొన్నేళ్ల క్రితం అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ పేరుతో వెబ్ సైట్ ఓపెన్ చేశామని కానీ అది వర్కౌట్ అవ్వలేదని తెలిపాడు. కానీ ఈసారి తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా సినీ డైరెక్టర్స్, నటీనటులు తదితరులతో కలసి సినిమాలకి సంబందించిన ఎన్నో విషయాలని ఆడియన్స్ కి తెలియజేస్తామని చెప్పుకొచ్చాడు. 

ALSO READ : ఫర్వాలేదనిపించిన రాబిన్ హుడ్

అలాగే ఆడియన్స్ కామెంట్ సెక్షన్ లో అడిగే సందేహాలు, ప్రశ్నలకి కూడా సమాధానాలు ఇస్తామని తెలిపాడు. దీంతో అమీర్ ఖాన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అయితే ఈ యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసిన రెండు రోజుల్లోనే 46వేల పైచిలుకు సబ్ స్క్రైబర్స్ వచ్చారు.

ఈ విషయం ఇలా ఉండగా నటుడు అమీర్ ఖాన్ "సితారే జమీన్ పర్, కూలీ, లాహోర్ 1947" సినిమాల్లో నటిస్తున్నాడు. ఇందులో కూలీ సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపిస్తుండగా సితారే జమీన్ పర్ సినిమాలో ఫుల్ లెంగ్త్ రోల్ లో నటిస్తున్నాడు. అంతేకాదు ఈ సినిమాకి నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు.