ప్రేమకి వయసుతో సంబంధం ఉండదని చెబుతుంటారు. దీంతో ఏ వయసువారైనా ఎపుడైనా ప్రేమించుకోవచ్చు.. పెళ్లి చేసుకోవచ్చు. అయితే సినిమా ఇండస్ట్రీలో మాత్రం సినీ సెలెబ్రెటీల ప్రేమ పెళ్లి వ్యవహారాలపై ఎక్కువగా కాంట్రవర్సీలు, రూమర్లు, గాసిప్స్ వంటివి ఎక్కువగా వినిపిస్తుంటాయి. బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ హిందీలో గుజారీష్, గజిని, దంగల్, 3 ఇడియట్స్ తదితర సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చకున్నాడు. ఐతే అమీర్ ఖాన్ సినిమాల పరంగా మాత్రమే కాదు తన పర్సనల్ లైఫ్ కాంట్రవర్సీలతో కూడా బాగానే పాపులర్ అయ్యాడు.
అయితే అమీర్ ఖాన్ 59 ఏళ్ళ వయసులో మళ్ళీ ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ సినీ వర్గాల సమాచారం ప్రకారం అమీర్ ఖాన్ కొత్త గర్ల్ ఫ్రెండ్ పేరు గౌరీ అని ఆమె బెంగళూరుకు చెందిన మహిళ అని తెలుస్తోంది. అయితే బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ భార్య పేరు కూడా గౌరి ఖాన్ కావడంతో కొందరు ఈ విషయానికి ముడిపెడుతూ వైరల్ చేస్తున్నారు. కానీ అమీర్ ఖాన్ గర్ల్ ఫ్రెండ్ గౌరీ మరియు షారుఖ్ భార్య గౌరీ ఖాన్ కి ఎటువంటి సంబందం లేదు.
ALSO READ | మెగాస్టార్ సినిమా కోసం ఫిల్మ్ నగర్ లో సెపరేట్ గా ఆఫీస్ తీశారట..
అమీర్ ఖాన్ కి గౌరీతో ఓ ప్రయివేట్ పార్టీలో పరిచయం ఏర్పడి ప్రేమగా మారిందని బాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే అమీర్ ఖాన్ విషయంలో ఇలాంటి వార్తలు వినిపించడం కొత్తేమీ కాదు. గతంలో తనతో కలసి దంగల్, తగ్స్ ఆఫ్ హిందుస్థాన్ తదితర సినిమాల్లో నటించిన యంగ్ హీరోయిన్ ఫాతిమా సనా షేక్ తో ప్రేమలో పడ్డాడని, డేటింగ్ కూడా చేస్తున్నారని ఈ క్రమంలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారని పలు వార్తలు బలంగా వినిపించాయి. కానీ మళ్ళీ ఏమైందో ఏమోగానీ ఈ వార్తలు వినిపించడం ఆగిపోయింది. కానీ అమీర్ ఖాన్ మాత్రం ఈ లవ్ ఎఫైర్ రూమర్స్ ఎప్పుడూ స్పందించ సరిలేదు కదా.. కనీసం పట్టించుకోలేదు.
ఈ విషయం ఇలా ఉండగా అమీర్ ఖాన్ 1986 లో ప్రముఖ ఫిలిం ప్రొడ్యూసర్ రీనా దత్తాను వివాహం చేసుకున్నాడు. వీరికి జునైద్ ఖాన్ మరియు ఇరా ఖాన్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు కానీ ఈ పెళ్లయిన 16 ఏళ్ళ తర్వాత పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత అమీర్ మళ్ళీ ప్రముఖ డైరెక్టర్ కిరణ్ రావ్ ని 2011లో వివాహం చేసుకున్నాడు. వీరికి ఆజాద్ రావు ఖాన్ అనే కుమారుడు ఉన్నాడు. కానీ 10 ఏళ్ళకి కిరణ్ రావ్ అమీర్ ఖాన్ పరస్పర అంగీకారంతో విడిపోయారు. ఆ తర్వాత అమీర్ ఖాన్ ప్రేమాయణాల గురించి తరచూ వార్తలు వినిపిస్తూనే ఉంటున్నాయి.