Aamis OTT: మనిషి మాంసానికి అలవాటుపడిన డాక్టర్.. OTTలో ఒళ్ళు జలదరరించే థ్రిల్లర్ మూవీ

Aamis OTT: మనిషి మాంసానికి అలవాటుపడిన డాక్టర్.. OTTలో ఒళ్ళు జలదరరించే థ్రిల్లర్ మూవీ

మనం ఇప్పటివరకు చాలా ప్రేమకథలు చూశాము, విన్నాము కూడా. ఆ కథల్లో కొన్ని రొటీన్ గా అనిపించినా.. కొన్ని మాత్రం చాలా కొత్తగా అనిపిస్తాయి. ఇక ప్రేమించిన అమ్మాయి గానీ, అబ్బాయి గానీ ఏదైనా అడిగారంటే అంతే.. అందుకోసం ఏం చేయడానికైనా సిద్ధపడతారు ప్రేమికులు. సరిగ్గా ఇలాంటి కథతోనే ఓక భయంకరమైన, ఒళ్ళు జలదరరించే ప్రేమకథ చిత్రం వచ్చింది. అదే ఆమిస్. ఇదొక ప్రేమకథ కానీ.. చాలా కొత్తగా అనిపిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీ లివ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. 

ఇక ఆమిస్ కథ విషయానికి వస్తే.. ఈ సినిమాలో ముఖ్యంగా రెండు పాత్రలు మాత్రమే ఉంటాయి. అందులో ఒకటి సుమన్ కాగా.. మరో పాత్ర నిర్మలి. సుమన్ తన గ్యాంగ్ తో కలిసి అడవికి వెళ్లి అక్కడ దొరికిన జంతువుల మాంసాన్ని తింటూ ఉంటాడు. అలా కొంతకాలం తర్వాత తన ఫ్రెండ్ కి ఆరోగ్య సమస్యల కారణంగా పక్కనే ఉన్న హాస్పిటల్ కి తీసుకెళ్తాడు. అక్కడ నిర్మలి డాక్టర్ గా ఉంటుంది. అలా సుమన్, నిర్మలి మధ్య స్నేహం పెరుగుతుంది. 

ఇక నిర్మలికి కూడా మాంసాహారం అంటే ఇష్టం అవడంతో రోజుకో వెరైటీ మాంసాన్ని ఆమెకోసం తెస్తూ ఉంటాడు సుమన్. ఒక రోజు సుమన్ తన శరీరంలో ఒక భాగాన్ని కోసి ఆమెకు వండి పెడతాడు. ఆలా నిర్మలికి మనిషి మాంసంపై ఇష్టం పెరుగుతుంది. అలా మనిషి మాంసానికి అలవాటుపడ్డ నిర్మలి కోసం సుమన్ ఏం చేశాడు అనేది మిగిలిన కథ. వింటుంటేనే ఇంత ఘోరంగా ఉంటే.. ఇక చూస్తుంటే ఇంకెలా ఉంటుందో. వీలుంటే మీరు కూడా చూసేయండి.