ముఖ్యమంత్రిని ఓడించి తీరుతాం

అమృత్సర్: పంజాబ్ ఎన్నికల్లో తమ పార్టీ విజయఢంకా మోగిస్తుందని ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ధీమా వ్యక్తం చేశారు. ఆ రాష్ట్ర సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీని తప్పక ఓడిస్తామని ఆయన స్పష్టం చేశారు. ‘పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీ ఓ సర్కస్ లా మారింది. తాను పోటీ చేయబోయే రెండు నియోజవర్గాల్లోనూ సీఎం చన్నీకి ఓటమి తప్పదు. మేం ఆయన్ని ఓడిస్తాం. ఎమ్మెల్యే కాలేనప్పుడు ఆయన ముఖ్యమంత్రి ఎలా అవుతారు? భగవంత్ మాన్ తదుపరి సీఎం అవుతారు. ఆయన బాధ్యతలు చేపట్టాక పంజాబ్ లో జరుగుతున్న ఇసుక మైనింగ్ పై విచారణ జరుగుతుంది. ఇసుక తవ్వకాల్లో చన్నీతోపాటు ఆయన కుటుంబీకుల పాత్ర స్పష్టంగా ఉందని తెలిసినా.. ఆయన్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు. 

మరిన్ని వార్తల కోసం:

యూపీలో గెలిచేది ఆయనే

యోగి ఎట్ల చెబితే అట్ల!

ఒక్క సీన్ కోసం రూ. 60 కోట్లు ఖర్చు