చండీగఢ్: మద్యం తాగి విమానం ఎక్కిన సీఎం భగవంత్ మాన్ను జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్టులో సిబ్బంది దించేశారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఢిల్లీ వచ్చేందుకు లుఫ్తాన్సా ఫ్లైట్ ఎక్కిన టైంలో ఈ ఘటన జరిగిందని శిరోమణి అకాలీ దళ్(ఎస్ఏడీ) చీఫ్ సుఖ్బీర్ సింగ్ బాదల్ ఆరోపించారు. ‘‘అసలు నడవలేని స్థితిలో భగవంత్ మాన్ ఉన్నట్టు కొందరు ప్యాసింజర్లు మీడియాకు చెప్పారు. దీంతో విమానం 4గంటలు ఆలస్యంగా బయలుదేరింది.
అందుకే ఢిల్లీలో నిర్వహించిన ఆప్ సదస్సుకు ఆయన హాజరుకాలేదు. పంజాబీలు, దేశ గౌరవానికి సంబంధించిన అంశం కావడంతో ఇండియన్ గవర్నమెంట్ కలగజేసుకోవాలి. జర్మనీ ప్రభుత్వంతో మాట్లాడి నిజమేంటో బయటపెట్టాలి” అని సుఖ్బీర్సింగ్ డిమాండ్ చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపించాలని ప్రతిపక్ష నేత ప్రతాప్ సింగ్ బాదల్ కోరారు. ఈ ఆరోపణలను ఆప్ నేత మల్విందర్ సింగ్ ఖండించారు.