పంజాబ్ సీఎం ఇంట్లో పోలీసుల సోదాలు!..

పంజాబ్ సీఎం ఇంట్లో పోలీసుల సోదాలు!..

న్యూఢిల్లీ: సెంట్రల్ ఢిల్లీలో ఉన్న పంజాబ్ సీఎం భగవంత్​మాన్ ఇంటికి గురువారం భారీగా పోలీసులు వెళ్లారు. మెయిన్ గేట్లు క్లోజ్ చేసి ఎవరినీ లోపలికి అనుమతించలేదు. దీనిపై ఆప్ నేతలు తీవ్రంగా స్పందించారు. 

సీఎం ఇంట్లో సోదాలు చేసేందుకే పోలీసులు వచ్చారని మండిపడ్డారు. బీజేపీ తప్పులను మాత్రం  ఈసీ, పోలీసులు పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యారు. కాగా, ఓటర్లను మభ్య పెట్టేందుకు డబ్బులు పంచుతున్నారన్న ఫిర్యాదు మేరకు పోలీసులు తనిఖీలకు వెళ్లినట్లు తెలిసింది. 

న్యూఢిల్లీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి ఓపీ పాండే మీడియాతో మాట్లాడుతూ.. ‘‘పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఇంటి నుంచే డబ్బులు పంచుతున్నట్లు సీవిజిల్ యాప్​లో  కంప్లైంట్ వచ్చింది. దీనిని100 నిమిషాల్లో పరిష్కరించాలి. కానీ.. ఇక్కడి సిబ్బంది  మమ్మల్ని లోపలికి వెళ్లనివ్వడం లేదు’’అని తెలిపారు.