క్రాకర్స్​పై బ్యాన్​లో మత కోణం లేదు: కేజ్రీవాల్

క్రాకర్స్​పై బ్యాన్​లో మత కోణం లేదు: కేజ్రీవాల్
  •     వాయు కాలుష్యం నుంచి రక్షించేందుకే నిషేధం: కేజ్రీవాల్

ఢిల్లీ : కాలుష్యం నుంచి ప్రజలను రక్షించేందుకే ఢిల్లీలో ఫైర్ క్రాకర్స్​పై నిషేధం విధించామని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఇందులో హిందూ -ముస్లిం కోణం లేదని తెలిపారు. దీపావళి దీపాల పండుగ అని, కాలుష్యానికి కారణమయ్యే పటాకులు పేల్చడం కాకుండా దీపాలు, కొవ్వొత్తులు వెలిగించి పండుగ జరుపుకోవాలని కేజ్రీవాల్ సూచించారు. "మనం ఎవరికో ఉపకారం చేయడంలేదు, మనకు మనమే చేసుకుంటున్నాము. ఎందుకంటే పటాకులు కాల్చడం వల్ల ఏర్పడే కాలుష్యంతో మనతో పాటు మన పిల్లలు కూడా ఇబ్బందిపడతారు" అని బుధవారం ఆయన మీడియాతో చెప్పారు.