
- ఆప్ రాష్ట్ర కన్వీనర్ దిడ్డి సుధాకర్ ప్రశ్న
ట్యాంక్ బండ్, వెలుగు: హైదరాబాద్సెంట్రల్ యునివర్సిటీకి చెందిన 400 ఎకరాలను హైడ్రా కాపాడదా అని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ ప్రశ్నించారు. ఆ భూముల్లో అడవితోపాటు పీకాక్ లేక్, బఫెల్లో లేక్, క్రేన్ లేక్ లు ఉన్నాయన్నారు. గ్రేటర్పరిధిలోని అన్నీ చెరువులను కాపాడతానని చెప్పిన హైడ్రా కమిషనర్రంగనాథ్ఇప్పుడు ఏం చేస్తున్నారని నిలదీశారు. 400 ఎకకరాలు బఫర్ జోన్ పరిధిలోకే వస్తాయన్నారు.
శంషాబాద్: హెచ్ సీయూ భూముల జోలికొస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని ఎస్ఎఫ్ఐ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కె.వై.ప్రణయ్ హెచ్చరించారు. రాష్ట్రంలో బుల్డోజర్ల పాలన నడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హెచ్ సీయూ భూములను కాపాడాలంటూ శంషాబాద్లో ఆందోళనకు దిగిన ప్రణయ్, సీపీఎం జిల్లా నాయకుడు నీరటి మల్లేశ్, ప్రజా సంఘాల నాయకులను ఆర్జీఐ పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు.