ఆప్​ దారి తప్పింది.. జనం ఓడించిన్రు.. సామాజిక కార్యకర్త అన్నా హజారే

 ఆప్​ దారి తప్పింది.. జనం ఓడించిన్రు.. సామాజిక కార్యకర్త అన్నా హజారే

రాలేగావ్​సిద్ధి(మహారాష్ట్ర): లిక్కర్ ​పాలసీ, డబ్బుపై దృష్టి పెట్టడం వల్లే కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ‘మునిగిపోయింది’ అని సామాజిక కార్యకర్త అన్నా హజారే అన్నారు. ప్రజలకు నిస్వార్థంగా సేవ చేయాలనే విధిని అర్థం చేసుకోవడంలో ఆప్ ప్రభుత్వం ఫెయిల్ అయి.. తప్పుడు మార్గాలను ఎంచుకుందని తెలిపారు. 2011లో అవినీతి వ్యతిరేక ఉద్యమానికి నాయకత్వం వహించిన అన్నా హజారే శనివారం రాలెగావ్ సిద్ధి గ్రామంలో ఆప్ ఓటమిపై మీడియాతో మాట్లాడారు.

 ‘‘లిక్కర్ పాలసీతో డబ్బు వచ్చింది, వారు ఆ మత్తులో మునిగిపోయారు. ఆప్ ఇమేజ్ మసకబారింది. కేజ్రీవాల్ ఒకవైపు క్లీన్​ క్యారెక్టర్ గురించి, మరోవైపు లిక్కర్​ పాలసీ గురించి విభిన్నంగా మాట్లాడటం ప్రజలు గమనించారు” అని అన్నారు. అవినీతి వ్యతిరేక కార్యకర్త వ్యక్తిత్వం క్లీన్​గా ఉండాలన్నారు. కానీ ఆప్ ప్రభుత్వంలో డబ్బుకు ప్రాధాన్యం పెరగడంతో.. ఆ పార్టీ దెబ్బతిన్నదని.. ఓడిపోయిందని చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు అతని వ్యక్తిత్వం క్లీన్​గా, మచ్చలేనిదిగా ఉండాలని తాను మొదటి నుంచి చెప్తున్నానని అన్నారు.