ఆయుష్మాన్ భారత్తో ఢిల్లీవాసులకు ప్రయోజనం నిల్

ఆయుష్మాన్ భారత్తో ఢిల్లీవాసులకు ప్రయోజనం నిల్
  • ఆప్ నేత సంజయ్ సింగ్ విమర్శ

న్యూఢిల్లీ: ఆయుష్మాన్ భారత్ స్కీమ్ తో ఢిల్లీ వాసులకు ప్రయోజనం లేదని ఆప్ నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాలతో ఢిల్లీ, బెంగాల్ ప్రభుత్వాలు ఈ స్కీమ్​ను అమలు చేయడం లేదని ప్రధాని మోదీ విమర్శించడంతో ఆయన ఈ ఆరోపణలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ‘‘ఫ్రిజ్, బైక్​ లేదా రూ.10 వేల కంటే ఎక్కువ ఆదాయం ఉంటే ఆయుష్మాన్ భారత్ స్కీమ్ ప్రయోజనాలను పొందలేరు. 

ఈ రూల్స్ వల్ల ఢిల్లీ వాసులకు ఎలాంటి ప్రయోజనం లేదు. ఈ పథకం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అతి పెద్ద కుంభకోణాల్లో ఒకటి. హర్యానా, యూపీకి సంబంధించిన డేటాను విశ్లేషిస్తే ఈ విషయం తెలుస్తుంది’’ అని సంజయ్‌ సింగ్‌ ఆరోపించారు.