మనీలాండరింగ్ కేసులో సుదీర్ఘంగా జైలులో ఉన్న ఢిల్లీ మాజీ మంత్రి, ఆప్ నేత సత్యేందర్ జైన్ కు అక్టోబర్ 18న బెయిల్ మంజూరు చేసింది. మనీలాండరింగ్ ఆరోపణలపై సత్యేందర్ జైన్‌ను ఈడీ మే 2022లో అరెస్టు చేసింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ కింద దాదాపు 18 నెలల పాటు జైలులో ఉన్నారు ఆయన. మాజీ మంత్రి సత్యేందర్ జైన్‌కు ఢిల్లీ కోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. చాలా రోజులుగా రూస్ అవెన్యూ కోర్టు నిర్బంధించిందని, సత్వర విచారణ హక్కుల కారణంగా బెయిల్ మంజూరు చేయబడింది. పలు ఆంక్షలతోపాటు రూ.50వేల వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. సత్యేందర్ కోర్టు ముందస్తు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లకూడదని కోర్టు పేర్కొంది.
ALSO READ | మళ్లీ రష్యా వెళుతున్న ప్రధాని మోదీ
బెయిల్ మంజూరు చేస్తూ.. మనీష్ సిసోడియా కేసులో సుప్రీం కోర్టు తీర్పును ప్రస్తావించింది. సత్వర విచారణ హక్కును ప్రాథమిక హక్కు అని సుప్రీం కోర్టు చెప్పుకొచ్చింది. నాలుగు షెల్ కంపెనీల ద్వారా మనీలాండరింగ్ చేసిన ఆరోపణలపై 2022 మే 30న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) జైన్‌ను అరెస్టు చేసింది. వివిధ మనీలాండరింగ్ కేసుల్లో ఇప్పటికే ముగ్గురు ఆప్ నేతలు బెయిల్ పొందారు. అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా మరియు సంజయ్ సింగ్ తర్వాత సత్యేందర్ జైన్ నాలుగో వ్యక్తి.