కిషన్ రెడ్డి కాన్వాయ్ ని అడ్డుకున్న ఆప్ నేతలు

హైదరాబాద్ అబిడ్స్ లో  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాన్వాయ్ ని ఆప్ నాయకులు అడ్డుకున్నారు. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొంది.  కలెక్టర్ కార్యాలయంలో ఓ కార్యక్రమానికి వచ్చిన  కిషన్ రెడ్డి  కార్యక్రమం ముగించుగొని అక్కడి నుండి తిరిగి వెళ్తున్న సమయంలో ఆయన కాన్వాయ్ ని అడ్డుకున్నారు. నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు ఆప్ నేతలు. దీంతో బీజేపీ కార్పొరేటర్లు , ఆప్ నాయకులు కొద్దిసేపు వాగ్వాదానికి దిగడంతో    అక్కడ కాసేపు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. వెంటనే పోలీసులు వచ్చి ఇరు వర్గాలను అదుపు చేశారు.

 

HDFC అకౌంట్స్‌‌లో కోట్లాది రూపాయలు

కాంగ్రెస్ పై నగ్మా అసంతృప్తి

పుణె డిఫెన్స్ అకాడమీలో పాసింగ్ అవుట్ పరేడ్