![ఢిల్లీలో బీజేపీ గెలిస్తే కేటీఆర్ సంతోషిస్తున్నారు.. ఉపఎన్నికలు వస్తే తప్పకుండా పోటీలో ఉంటా: కడియం](https://static.v6velugu.com/uploads/2025/02/aap-lost-delhi-because-of-brs-says-mla-kadiam-srihari_phSTAx2ruH.jpg)
ఢిల్లీ అసెంబ్లీ ఫలితాలపై MLA కడియం శ్రీహరి సంచలన కామెంట్స్ చేశారు. డిల్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే కేటీఆర్ సంతోషపడుతున్నారని, అక్కడ ఆప్ ఓడిపోవడానికి బిఆర్ఏస్సే ప్రధాన కారణమని అన్నారు. లిక్కర్ స్కాం తోనే ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయిందని, దీనికి కారణం BRS తో స్నేహం చెయ్యడమేనని అన్నారు.
ఢిల్లీ ఎన్నికల్లో ఆప్-- కాంగ్రెస్ పార్టీ లు కలిసి పోటీ చేస్తే బాగుండేదని, కేజ్రీవాల్ అతిగా ఊహించుకుని ఒంటరిగా వెళ్లడంతో ఓటమి చవిచూశారని కడియం విమర్శించారు. రెండు పార్టీలు కలిసి పోటీ చేసి ఉంటే బీజేపీకి అవకాశం ఉండేది కాదని అభిప్రాయపడ్డారు.
ఉపఎన్నికలు వస్తే తప్పకుండా పోటీలో ఉంటా:
MLA ల అనర్హత పిటిషిన్ పై ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పందించారు. MLA ల అనర్హత పిటిషన్ సుప్రీంకోర్టులో ఉందని, ఈనెల 10వ తేదిన తీర్పు రాబోతుందని అన్నారు. కోర్టు తీర్పును తప్పకుండా శిరాసవహిస్తానని, అందులో వెనక్కి పోయేదిలేదు.. వేరే ఆలోచన లేదన్నారు. ఒకవేళ ఉపఎన్నికలు వస్తే తప్పకుండా పోటీలో ఉంటానని స్పష్టం చేశారు.
BRS స్వార్థ రాజకీయాలు చేస్తుందని, ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మంచిదని సూచించారు. ఫిరాయించిన MLA లను మంత్రులు చేసిన ఘనత BRS పార్టీదేనని విమర్శించారు. అప్పట్లో ఫిరాయింపులను ప్రోత్సహించిన BRS నేతలు సుద్దపూసల్లాగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఫిరాయింపుల మీద మాట్లాడే నైతిక హక్కు BRS కు లేదన్నారు. BRS చేస్తే సంసారం.. తాము చేస్తే వ్యవభిచరమా? అని ప్రశించారు.