రాత్రంతా అసెంబ్లీలోనే పడుకున్నఆప్ ఎమ్మెల్యేలు

రాత్రంతా అసెంబ్లీలోనే పడుకున్నఆప్ ఎమ్మెల్యేలు

పంజాబ్ సీఎం అమర్ సింగ్  వైఖరికి వ్యతిరేకంగా ఆప్ ఎమ్మెల్యేలు రాత్రంతా అసెంబ్లీలోనే ఉండి నిరసన తెలిపారు.  కేంద్ర ప్రభుత్వం తెచ్చిన అగ్రి బిల్లు కాపీలను సీఎం ఇవ్వడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త వ్యవసాయ చట్టాలకు సంబంధించిన ముసాయిదాను మంగళవారం అసెంబ్లీలో ప్రవేశ పెట్టాలి. అయితే  కొత్త చట్టం ముసాయిదా కాపీలను తమకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.  కొత్త చట్టాలను వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ముసాయిదా కాపీలు ఎందుకివ్వడం లేదని అడిగారు. ముసాయిదా కాపీలలో ఏముందో తెలియకుండా సభలో ఎలా చర్చిస్తారని ప్రశ్నించారు. దీనికి నిరసనగా వారు రాత్రంతా అసెంబ్లీలో సోఫాలపైనే పడుకున్నారు.

త్వరలో నాలుగో సింహం..పోలీస్ గెటప్ వేస్తే పౌరుషం వస్తుంది

మరోసారి నేపాల్ దొంగల బీభత్సం.. మత్తిచ్చి ఇళ్లు గుల్ల చేసి పరార్

తగ్గుతున్న కరోనా..24 గంటల్లో 46,791 కేసులు