నామీద జరిగిన దాడిపై చర్చించండి : స్వాతి మలివాల్

నామీద జరిగిన దాడిపై చర్చించండి : స్వాతి మలివాల్
  •  రాహుల్ సహా కూటమి నేతలకు స్వాతి మలివాల్ లేఖ

న్యూఢిల్లీ: ఇండియా కూటమి నేతలంతా సమావేశమై తనపై జరిగిన దాడిపై చర్చించాలని ఆప్ ఎంపీ స్వాతి మలివాల్ కోరారు. మంగళవారం ఈమేరకు కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ, ఎన్సీపీ(ఎస్పీ) చీఫ్ శరద్ పవార్​కు ఆమె లేఖ రాశారు. “సొంత పార్టీ వాలంటీర్లు, నేతలు నాకు సాయం చేయడానికి బదులు దాడులకు పాల్పడ్డారు. నా క్యారెక్టర్​ను కించపరిచారు. నామీద జరిగిన దాడిపై ఇండియా కూటమి నేతలంతా చర్చించాలి. 

 గత 18 ఏండ్లుగా నేను కిందిస్థాయిలో పనిచేశాను. 9 ఏండ్లలో మహిళా కమిషన్ లో 1.7 లక్షల కేసులు విన్నాను. ఎవరికీ భయపడకుండా, ఎవరి ముందు తలవంచకుండా మహిళా కమిషన్‌‌‌‌ను టాప్ పొజిషన్​కు చేర్చాను. అయితే, సీఎం ఇంట్లో నన్ను దారుణంగా కొట్టి నా క్యారెక్టర్​ను దిగజార్చారు. ఇండియా కూటమిలోని టాప్ లీడర్లందరికి దీనిపై నేను లేఖ రాశాను. సమావేశం ఏర్పాటు చేసి దీనిపై చర్చించాలని నేను కోరుతున్నాను” అని స్వాతి మలివాల్ పేర్కొన్నారు.