ఎట్టకేలకు సీఎం క్యాండిడేట్ ఎవరు అన్న సస్పెన్స్ కు తెరదించింది ఆమ్ ఆద్మీ పార్టీ. పంజాబ్ సీఎం అభ్యర్థి పేరు ప్రకటించింది. ఆప్ తరపున సీఎం అభ్యర్థిగా భగవంత్ మాన్ పేరును ప్రకటించారు ఢిల్లీ సీఎం, ఆప్ నేషనల్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్. భగవంత్ మాన్ ప్రస్తుతం సంగ్రూర్ నియోజకవర్గానికి లోక్ సభ ఎంపీగా ఉన్నారు. వచ్చే నెల పంజాల్ లో ఎన్నికలు జరగనున్నాయి. ప్రజాభిప్రాయ సేకరణలో 93.3 శాతం మద్దుతు భగవత్ మాన్ కు లభించిందని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఇప్పటికే ఎన్నికల తేదీని కూడా ఈసీ ఖరారు చేసింది. ప్రధాన పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. మాటల తూటాలతో ప్రచారాన్ని మరింత వేడిక్కిస్తున్నారు నాయకులు.
అయితే ఇప్పటివరకు విడుదల అయిన పలు సర్వేలు.. పంజాబ్ లో ఆప్ అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశముందని తెలిపాయి. ఇదే సమయంలో ఇటీవల జరిగిన చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో.. పోటీ చేసిన తొలిసారే అతిపెద్ద పార్టీగా ఆప్ అవతరించడంతో ఆ పార్టీ కార్యకర్తల్లో మరింత జోష్ నెలకొంది. ఆప్ అధినేత కేజ్రీవాల్ కూడా వరుస పంజాబ్ పర్యటనలు చేస్తూ అక్కడి కేడర్ లో జోష్ నింపడమే కాకుండా.. అనేక రకాల ఎన్నికల హామీలు ఇస్తున్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. గత అసెంబ్లీ పోరులో ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్‌లోని 117 సీట్లలో 20 స్థానాలను గెలిచింది.
#WATCH | Delhi CM & Aam Aadmi Party's national convenor Arvind Kejriwal announces party's chief ministerial candidate for the upcoming Punjab Assembly elections pic.twitter.com/cBEsKHAhEu
— ANI (@ANI) January 18, 2022
Aam Aadmi Party Lok Sabha MP from Sangrur constituency in Punjab Bhagwant Mann will be the party's chief ministerial candidate for the upcoming Assembly elections: Delhi CM & Aam Aadmi Party's national convenor Arvind Kejriwal#PunjabAssemblyelections2022 pic.twitter.com/Tkg0lb7B3K
— ANI (@ANI) January 18, 2022
ఇవి కూడా చదవండి:
గడ్డకట్టే మంచులో సైనికుల వాలీబాల్
ఎన్నికల వేళ సీఎంకు షాక్.. మేనల్లుడి ఇంటిపై ఈడీ దాడులు