కేజ్రీవాల్‌కు ఆరోగ్యం క్షీణించడానికి కారణమేంటి ?

ఢిల్లీ:  లిక్కర్ స్కాం కేసులో అరెస్టయి తీహార్  జైలులో ఉన్న  ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఒక్క సారిగా 4.5 కిలోల బరువు తగ్గారని ఆప్ వర్గాలు చెబుతున్నాయి.  మార్చి 21న కేజ్రీవాల్ ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కొన్ని రోజులుగా ఢిల్లీ సీఎం రక్తంలో చక్కెర స్థాయి హెచ్చుతగ్గులకు లోనవుతుందన్నారు. మరోవైపు తీహార్ జైలులో ఉన్న అధికారులు, అతను బాగానే ఉన్నారని, జైలు వైద్యులు అతని ఆరోగ్య పరిస్థితిపై పర్యవేక్షిస్తున్నారని చెబుతున్నారు.ఇదే అంశంపై ఆప్ మంత్రి అతిషి కూడా సోషల్ మీడియాలో స్పందించారు. అరవింద్ కేజ్రీవాల్ మధుమేహ వ్యాధిగ్రస్థుడని, నేడు బీజేపీ ప్రభుత్వం జైల్లో పెట్టి ఆయన ఆరోగ్యాన్ని మరింత ప్రమాదంలో పడేస్తోందని ఆరోపించారు.

ALSO READ:- అక్రమాస్తుల కేసులో శివబాలకృష్ణకు బెయిల్ మంజూరు