పంజాబ్ ఎన్నికలను ఆప్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. చిన్న రాష్ట్రాల వైపు దృష్టి సారించిన ఈ పార్టీ అక్కడ జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచింది. వినూత్నంగా ప్రచారం నిర్వహిస్తున్న ఆ పార్టీ..కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలే సీఎం అభ్యర్థిని ఎన్నుకోవాలంటూ..ఏకంగా ఓ ఫోన్ నెంబర్ ను కేటాయించారు. సీఎంగా ఎవరైతే బెటర్ అని ఆలోచించి.7074870748 నెంబర్ కు ఫోన్ చేసి అభిప్రాయం చెప్పాలన్నారు. వాట్సాప్ లో మేసేజ్ ద్వారా అభిప్రాయం చెప్పే అవకాశం ఉందన్నారు.
2022, జనవరి 17 సాయంత్రం 5 గంటలలోపు ప్రజలు తమ అభిప్రాయాన్ని తెలపాలని కోరారు. ఈ క్రమంలో…2022,జనవరి 18వ తేదీ మంగళవారం సీఎం అభ్యర్థిని ప్రకటిస్తామని ఆప్ పార్టీ వ్యవస్థాపకులు, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు పేరును ప్రకటిస్తామన్నారు. పార్టీ ఎంపీగా ఉన్న భగవంత్ మాన్ పేరును సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని కోరుకున్నా…ప్రజల నిర్ణయం తీసుకోవాలని కేజ్రీవాల్ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు…ఫిబ్రవరి 20కు పంజాబ్ ఎన్నికలు వాయిదా వేయాలని కోరటంపై ఈసీ క్లారిటీ ఇచ్చింది. ఫిబ్రవరి 14వ తేదీన జరగాల్సిన అసెంబ్లీ ఎన్నికలు వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 14న జరగాల్సిన అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 20కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.
మొత్తం 117 స్థానాలున్న పంజాబ్ లో ఫిబ్రవరి 20న ఒకే విడతలో పోలింగ్ నిర్వహించనున్నారు.
మరిన్ని వార్తల కోసం..
యూపీ ఎన్నికల్లో 100 స్థానాల్లో పోటీ చేస్తాం