![కాలేజీ స్టూడెంట్లకూ ఆపార్ ఐడీ](https://static.v6velugu.com/uploads/2025/02/aapar-id-for-college-students-education-department-decission_pEeo4kP91T.jpg)
- జూన్ నాటికి కంప్లీట్ చేయాలని విద్యాశాఖ నిర్ణయం
హైదరాబాద్, వెలుగు: కేంద్రం తీసుకొచ్చిన ఆటోమేటిక్ పర్మినెంట్ అకాడమీ అకౌంట్ రిజిస్ర్టీ(ఆపార్) ఐడీలను రాష్ట్రంలోని ప్రతి కాలేజీ స్టూడెంట్ కూ ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణయించింది. ప్రస్తుతం ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియెట్ స్టూడెంట్లకు ఈ ఐడీని కేటాయిస్తున్నారు.
తాజాగా కేంద్రం డిగ్రీ, పీజీతో పాటు అన్ని కోర్సుల విద్యార్థులకూ ఆపార్ ఐడీని ఇవ్వాలని రాష్ర్టాలకు ఆదేశాలిచ్చింది. దీంతో తెలంగాణలోనూ ఈ ప్రక్రియ ప్రారంభించాలని హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ డిసైడ్ అయింది. ఈ మేరకు బుధవారం కౌన్సిల్ చైర్మన్ బాలకిష్టారెడ్డి అన్ని వర్సిటీల వీసీలతో వర్చువల్ గా సమావేశం నిర్వహించారు. వర్సిటీల పరిధిలోని స్టూడెంట్లకు ఆపార్ ఐడీని క్రియేట్ చేయాలని సూచించారు. ఆధార్ కార్డు నంబర్ల ద్వారా ఈ ప్రక్రియను జూన్వరకూ పూర్తి చేయాలని ఆదేశించారు.