ఆపద్బాంధవుడు హీరోయిన్ ఇప్పుడెలా ఉందో చూడండి..!

ఆపద్బాంధవుడు హీరోయిన్ ఇప్పుడెలా ఉందో చూడండి..!

ఔరా అమ్మకుచెళ్ల అంటూ ఆపద్బాంధవుడు సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన ఆడిపాడిన హీరోయిన్ మీనాక్షి శేషాద్రి గుర్తుంది కదా. ఆపద్బాందవుడు సినిమాలో అమాయకపు హావభావాలతో ప్రేక్షకులకు కట్టిపడేసింది. అయితే అప్పటికీ.. ఇప్పటికీ ఆమెను చూస్తే ఎవ్వరూ గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. స్టైలిష్ లుక్ తో ఉన్న ఫొటోను ట్విట్టర్ లో పోస్ట్ చేసిన మీనాక్షి న్యూలుక్ అంటూ ట్వీట్ చేసింది. హెయిర్ స్టైల్, కళ్లద్దాలు పెట్టుకుని ఉంది.  ఈ ఫోటో చూసిన నెటిజన్లు అసలు ఈమె మీనాక్షి యేనా అని ఆశ్చర్యపోతున్నారు.  కె. విశ్వనాథ్ డైరెక్షన్ లో 1992లో విడుదలైన ఈ సినిమాలో చిరంజీవి సరసన మీనాక్షి శేషాద్రి హీరోయిన్‌గా నటించింది. 18 ఏళ్ల వయసులో మిస్‌ ఇండియా టైటిల్‌ సొంతం చేసుకొని పలు సినిమా అవకాశాలు దక్కించుకుంది. ఆపద్బాంధవుడు ముందు మీనాక్షిఅంతకుముందే తెలుగులో బ్రహ్మర్షి విశ్వామిత్ర అనే సినిమా చేసినా ..ఆమెకు  అంతగా గుర్తింపు రాలేదు.  ఆపద్బాంధవుడుతో తెలుగులో ఒక్కసారిగా పాపులర్‌ అయింది. చూడచక్కని రూపం, అమాయకపు హావభావాలతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఆ తర్వాత బాలీవుడ్‌లో వరుస అవకాశాలు దక్కించుకొని అక్కడ స్టార్‌ హీరోయిన్‌గా చక్రం తిప్పింది.

బాలీవుడ్‌లో మరోసారి చిరంజీవి సరసన గ్యాంగ్‌ లీడర్‌ రీమేక్‌ .. ఆజ్ కా గూండారాజ్ సినిమాలోనూ నటించింది. అలా బాలీవుడ్‌లో 30కి పైగా సినిమాల్లో నటించింది మీనాక్షి. అయితే 1995లో హరీష్ మైసూర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని సినిమాలకు దూరం అయిపోయింది. ఇద్దరు పిల్లలతో సంతోషంగా జీవితాన్ని గడిపేస్తుంది.  ప్రస్తుతం 58 ఏళ్ల మీనాక్షి ముఖంలో కళ తప్పిపోయి వయసు మళ్లిన ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయని... అప్పట్లో ఎంతో అందంగా ఉన్న  మీనాక్షి ఇలా అయ్యిందేంటి అంటూ ట్వీట్లు చేస్తున్నారు నెటిజన్లు.