కాంగ్రెస్ Vs ఆప్: ఆ లీడర్ను తొలగించాలంటూ కాంగ్రెస్ కు కేజ్రీవాల్ అల్టిమేటం

కాంగ్రెస్ Vs ఆప్: ఆ లీడర్ను తొలగించాలంటూ కాంగ్రెస్ కు కేజ్రీవాల్ అల్టిమేటం

ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పై కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి..మరికొద్దిరోజుల్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా..ఇండియా కూటమిలో కాంగ్రెస్ నేత వ్యాఖ్యలు ముసలం పుట్టించాయి. కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ వ్యాఖ్యలపై ఆప్ తీవ్రంగా మండిపండింది..24 గంటల్లో కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలని అల్టీమేటమ్ జారీ చేసింది. 

అరవింద్ కేజ్రీవాల్ అమలు కానీ సంక్షేమ పథకాల వాగ్దానాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, మోసగిస్తున్నారని కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ చేసిన వ్యాఖ్యల తో కలత చెందిన ఆప్ సంచలన వ్యాఖ్యలు చేసింది. 2013లో ఆప్ కి మద్దతిచ్చి చాలా తప్పు చేశాం.. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ పతనానికి దారి తీసిందని ఇటీవల అజయ్ మాకెన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో ఆప్ నేతలు మండిపడ్డారు.

ALSO READ | Airtel Outage: ఎయిర్‌టెల్ నెట్‌వర్క్​ డౌన్.. కోట్ల మంది కస్టమర్ల గగ్గోలు

అరవింద్ కేజ్రీవాల్ ను జాతీయ  వ్యతిరేకి అని కాంగ్రెస్ నేత అజయ్  మాకెన్ అభివర్ణించడాన్ని ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ తప్పుబట్టారు. 24 గంటల్లో ఆయనపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ను కోరారు. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించేందుకు కాంగ్రెస్ సిద్దమవుతుందని ఆరోపించారు. 

కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ బీజేపీ స్క్రిప్టును చదువుతున్నారు.. అజయ్  మాకెన్ పై ఎటువంటి చర్య తీసుకోకపోతే కాంగ్రెస్ ను కూటమినుంచి తొలగించేందుకు ఆప్ ఇండియా బ్లాక్ పార్టీలను కోరుతుందని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ అన్నారు. 

మరోవైపు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కై ఆప్ పార్టీని ఓడించేందుకు సిద్దమవుతున్నారని అన్నారు. సందీప్ దీక్షిత్ సహా కాంగ్రెస్ అభ్యర్థుల ఎన్నికల ఖర్చును బీజేపీ భరిస్తోందని’’ ఢిల్లీ సీఎం అతిషీ ఆరోపించారు. 

ఢిల్లీలో అధికార పార్టీ ఆప్ , కాంగ్రెస్ నేతలకు మధ్య దాడులనేపథ్యంలో అజయ్ మాకెన్ వ్యాఖ్యలు మరింత దుమారం రేపాయి. నాలుగోసారి అధికారంలో ఉన్న ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ ఒంటరిగా పోటీ చేస్తుందని కేజ్రీవాల్ గతంలో ప్రకటించారు. 

2024 లోక్‌సభ ఎన్నికల కోసం ఆప్‌తో పొత్తు పెట్టుకోవడంలో కాంగ్రెస్ చేసిన తప్పును సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని మాకెన్ బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ వ్యాఖ్యలను తీవ్రంగా తీసుకున్న ఆప్ ..24 గంటల్లో కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలని అల్టీమేటమ్ జారీ చేసింది.