ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆతిశీ ప్రమాణం

ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆతిశీ ప్రమాణం

ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆతిశీ సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆతిశీ సింగ్ తో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ప్రమాణం చేయించారు. ఆమెతోపాటు ఐదుగురు మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి మాజీ సీఎం కేజ్రీవాల్ హాజరయ్యారు. 

ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సీనియర్ నేత ఆతిశీ సింగ్ శనివారం( సెప్టెంబర్ 21)  ప్రమాణ స్వీకారం చేశారు. ఎక్సైజ్ పాలసీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ సుప్రీంకోర్టు నుంచి బెయిల్ పొందిన తరువాత ముఖ్యమంత్రి పదవికి రాజీనామా అరవింద్ కేజ్రీవాల్ చేశారు. ఆ తర్వాత ఆతిశీ సింగ్ ను తదుపరి సీఎం ప్రకటించారు. ఢిల్లీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన అతి చిన్న వయస్కురాలు ఆతిశీ సింగ్.  

ALSO READ : సీనియర్​ నేత ఖర్గేను అవమానిస్తరా.. ప్రధాని మోదీపై ప్రియాంక గాంధీ ఫైర్​

కల్కాజీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఆతిశీ సింగ్. ఢిల్లీ కేబినెట్లో ఉన్న ఏకైక మహిళా మంత్రి. కేజ్రీవాల్ రాజీనామా తర్వాత సెప్టెంబర్ 17న జరిగి ఆప్ పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో తదుపరి ముఖ్యమంత్రిగా ఆతిశీని ఎన్నుకున్నారు. 

ఆతిశీ కేబినెట్ లో మంత్రులు 

కొత్త ముఖ్యమంత్రి ఆతిశీ కేబినెట్లోకి కొత్త ముఖాలు కనిపించాయి. ఢిల్లీ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినవారిలో గోపాల్ రాయ్, కైలాష్ రాయ్, గహ్లోత్, సౌరభ్ భరద్వాజ్, ఇమ్రాన్ హుస్సేన్, ముఖేష్ అహ్లావత్ ఉన్నారు. ముఖేష్ అహ్లావత్ సుల్తాన్ పూర్ మజ్రా నుంచి తొలిసారి ఎన్నికయ్యారు. ఇందులో రాయ్, గహ్లోత్, భరద్వాజ్, హుస్సేన్ లు పాతమంత్రులే.. కేజ్రీవాల్ కేబినెట్ లో కూడా మంత్రులుగా ఉన్నారు.