కేజ్రీవాల్ అహంకారం వల్లే ఆప్ ఓటమి.. ‘ద్రౌపది వస్త్రాపహరణ’ ఫోటో షేర్ చేసిన ఎంపీ స్వాతి మలివాల్

కేజ్రీవాల్ అహంకారం వల్లే ఆప్ ఓటమి.. ‘ద్రౌపది వస్త్రాపహరణ’ ఫోటో షేర్ చేసిన ఎంపీ స్వాతి మలివాల్

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్), ఆ పార్టీ అధినేత అర్వింద్ కేజ్రీవాల్ ‘అహంకారం’ వల్లే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారని రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ అన్నారు. ఈ సందర్భంగా మహాభారతంలోని ‘దౌపది వస్త్రాపహరణ’ ఘట్టానికి సంబంధించిన ఫోటో ‘ఎక్స్’ లో షేర్ చేశారు. శనివారం మధ్యాహ్నం తర్వాత ఢిల్లీ ఎన్నికల్లో ‘ఆప్’ ఓటమి దాదాపు ఖాయమై బీజేపీ విజయం వైపు వెళ్తున్న ‘ట్రెండ్స్’ కొనసాగుతున్న సమయంలో ఆమె ఈ పోస్ట్ లు పెట్టారు. 

అలాగే ‘‘రావణుడి అహంకారం కూడా కొనసాగలేదు’’ అని మరొక పోస్టులో పేర్కొన్నారు. మలివాల్ గతేడాది ఆప్ తో విభేదించిన సంగతి తెలిసిందే. నిరుడు కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సీఎంవోలోనే ఆమెపై దాడి జరిగింది. కేజ్రీవాల్​వ్యక్తిగత సహాయకుడు బిభవ్​కుమార్​ఆమెపై భౌతిక దాడికి పాల్పడి తీవ్రంగా కొట్టినట్టు కేసు నమోదైంది. ద్రౌపది వస్త్రాపహరణ ఘట్టం ఫోటోలు ఆ విషయాన్ని గుర్తు చేసే ఉద్దేశంతోనే ఆమె పోస్టు 
చేసిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.