పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అనుమానాస్పదస్థితిలో మృతిచెందారు. లూథియానా ఎమ్మెల్యే గురు ప్రీత్ గోగి తలపై బుల్లెట్ గాయాలతో డీఎంసీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. శుక్రవారం (జనవరి 10) అర్థరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.
పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. అర్థరాత్రి గుర్ ప్రీత్ గోగి రూం నుంచి తుపాకీ పేలిన శబ్ధం వినిపించడంతో అక్కడి వెళ్లిన కుటుంబ సభ్యులకు గురు ప్రీత్ గోగి రక్తపు మడుగులో కనిపించాడు. తలపై బుల్లెట్ గాయాలతో తలకు తీవ్ర గాయాలయ్యాయి.. వెంటనే చికిత్స కోసం డీఎంసీ ఆస్పత్రి తరలించారు.. అప్పటికే గురుప్రీత్ గోగి చనిపోయినట్లు ప్రకటించారు.
గుర్ ప్రీత్ గోగి అనుమానాస్పద మృతి పై పోలీసులు మాట్లాడుతూ.. తలపై రెండు బుల్లెట్ గాయాలున్నాయి. గురు ప్రీత్ గోగిని ఎవరైనా హత్య చేశారా.. ప్రమాదవశాత్తు జరిగిందా అనేది ..పోస్ట్ మార్ట్ రిపోర్టు వస్తే.. విచారణలో తేలుతుందని.. ప్రస్తుతం గురుప్రీత్ గోగి మృతి దేహాన్ని పోస్టు మార్టమ్ కోసం డీఎంసీ ఆస్పత్రి మార్చురీలో ఉంచామని చెప్పారు.