రిలీజ్కు ముందే.. 6 ఇంటర్నేషనల్ అవార్డులు సొంతం.. సత్తా చాటుతోన్న అరి మూవీ

రిలీజ్కు ముందే.. 6 ఇంటర్నేషనల్ అవార్డులు సొంతం.. సత్తా చాటుతోన్న అరి మూవీ

పేపర్ బాయ్ ఫేమ్ జయ శంకర్( JayaShankar) డైరెక్షన్ లో యూనివర్సిల్ కాన్సెప్ట్‌తో వస్తోన్న మూవీ అరి(Ari ). ఈ మూవీ నుంచి రిలీజైన ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్‌తోనే మూవీపై పాజిటివ్ హైప్ వచ్చేసింది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ మూవీ రిలీజ్ కాకముందే పలు జాతీయ అవార్డులను కైవసం చేసుకుంది. ప్రతి ఒక్కరిలో అంతర్గతంగా దాగి ఉండే కామ, క్రోధ, లోభ, మొహ, మద, మాత్సర్యాలతో.. పోరాటమే అరి మూవీ. ఈ మూవీకు గాను ఆఫ్టర్ లైఫ్, మద్రాస్ ఫిలిం ఫెస్టివల్, స్వీడన్ ఫిలిం అవార్డ్స్, ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్, బెల్జీయం వంటి అవార్డులను గెలుచుకున్నట్లు మూవీ యూనిట్ పేర్కొంది. 

కనిపించే శత్రువుతో పోరాటం కంటే.. మనిషిలో కనిపించని శత్రువుతో పోరాటం ఇంకా కష్టం అంటూ తెలిపే ఈ కథ అందరినీ కదిలిస్తుందని తెలుస్తోంది. మనిషి లోపల ఉండే  ‘అరి’షడ్వర్గాలు మనిషి పతనానికే కాకుండా.. ప్రకృతి వినాశనానికి కూడా దారితీస్తాయని డైరెక్టర్ వివరించే ప్రయత్నం చేశారని టాక్ వినిపిస్తోంది.

రీసెంట్ గా ఈ మూవీ నుంచి రిలీజైన ట్రైలర్, చిన్నారి కిట్టయ్య సాంగ్ కు అనూహ్య రీతిలో రెస్పాన్స్ వచ్చింది. అనూప్ రూబెన్స్ స్వరపరిచిన ఈ గీతాన్ని కాసర్ల శ్యామ్ రచించగా, మంగ్లీ పాడారు. 

ఈ మూవీ ఆరుగురు జీవితాల చుట్టూ తిరుగుతూ..మనిషిలో దాగున్నఎమోషన్స్ తో  సాగే కథని తెలుస్తోంది. ఈ మూవీలో  సాయికుమార్, సుభలేఖ సుధాకర్, అనసూయ, శ్రీకాంత్ అయ్యర్, సురభి ప్రభావతి, వైవా హర్ష ఈ ఆరుగురు ఆరు ఇంపార్టెంట్స్ రోల్స్‌లో కనిపిస్తోన్నారు .  

వీరితో పాటు సుమన్, ఆమని, చమ్మక్ చంద్ర, శ్రీనివాస రెడ్డి ఇతర పాత్రల్లో కనిపించారు. ఆర్వీ రెడ్డి సమర్పణలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న అరి మూవీని  శేషు మారంరెడ్డి, శ్రీనివాస్ రామిరెడ్డిలు నిర్మిస్తున్నారు. అరి..మై నేమ్ ఇస్ నో బడీ..అనే ట్యాగ్ తో వస్తోన్న ఈ మూవీ త్వరలో రిలీజ్ కానుంది.