
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో 2025, ఏప్రిల్ 7 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్ కానున్నాయి. ప్రభుత్వం పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. పాత బకాయిల కోసం 10 నెలల్లో 26 సార్లు ప్రభుత్వానికి లేఖలు రాశామని.. అయినా ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదని అసోసియేషన్ సభ్యులు తెలిపారు. ఇప్పటికే రూ.3,500 కోట్ల పెండింగ్ బిల్లులు ప్రభుత్వం నుంచి బిల్లులు రావాల్సి ఉందన్నారు.
పాత బకాయిలు చెల్లించి, కొత్త బిల్లులు సకాలంలో చెల్లించే వరకు వైద్యసేవలు పునరుద్దరించమని ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేస్తామని స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ అల్టిమేటం జారీ చేయడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. అసోసియేషన్ సభ్యులతో చర్చలు జరిపేందుకు అధికారులు రెడీ అవుతోన్నట్లు తెలిసింది. పేదలకు ఉచిత వైద్యం అందించే ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోతే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని.. పెండింగ్ బకాయిలు చెల్లించాలని ప్రభుత్వ పెద్దలు ఆదేశించినట్లు సమాచారం.