టీ20 వరల్డ్ కప్ 2024లో అదరగొట్టిన అమెరికా ఆటగాడు ఆరోన్ జోన్స్ కరేబియన్ ప్రీమియర్ లీగ్ లో జాక్ పాట్ కొట్టేశాడు.కరీబియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్ కోసం సెయింట్ లూసియా కింగ్స్ ఆరోన్ జోన్స్‌తో ఒప్పందం చేసుకున్నట్లు ఆ జట్టు సోమవారం (జూలై 15) ప్రకటించబడింది. ఆగస్టు 29 నుండి అక్టోబర్ 4 వరకు ఈ టోర్నీ జరగనుంది. సీజన్ తొలి మ్యాచ్ లో సెయింట్ కిట్స్, ఆంటిగ్వా తలపడతాయి. అదే రోజు నెవిస్ పేట్రియాట్స్ తో బార్బుడా ఫాల్కన్స్ మ్యాచ్ ఆడనుంది.
టీ20 వరల్డ్ కప్ లో జోన్స్ సూపర్ బ్యాటింగ్ తో అలరించాడు. తొలి మ్యాచ్ లో కెనాడాపై 40 బంతుల్లో 94 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. క్రిస్ గేల్ తర్వాత టీ20 ప్రపంచకప్ లో ఒక ఇన్నింగ్స్ లో 10 లేదా అంతకంటే ఎక్కువ సిక్సర్లు కొట్టిన రెండో ఆటగాడిగా నిలిచి అరుదైన రికార్డ్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. తన ఫామ్ ను రెండో మ్యాచ్ లోనూ కొనసాగించాడు. పాకిస్థాన్ పై 26 బంతుల్లో 36 పరుగుల చేసి అజేయంగా నిలిచాడు. జోన్స్ ప్రదర్శనతో అమెరికా వరల్డ్ కప్ లో సూపర్ 8 కు అర్హత సాధించింది.
ALSO READ | IND vs SL 2024: శ్రీలంకతో వన్డే సిరీస్‌కు హార్దిక్ పాండ్య దూరం.. కారణమిదే..?
ప్రస్తుతం జోన్స్ మేజర్ లీగ్ క్రికెట్ లో సీటెల్ ఓర్కాస్ తరపున ఆడుతున్నాడు. తన తొలి మ్యాచ్ లో 16 బంతుల్లో 12 పరుగులు చేసి విఫలమయ్యాడు. జోన్స్ ప్రాతినిధ్యం వహిస్తున్న సెయింట్ లూసియా కింగ్స్ రానున్న సీజన్ లో కరీబియన్ ప్రీమియర్ లీగ్ టైటిల్ గెలుచుకోవాలని చూస్తుంది. 2023 సీజన్ లో జమైకా తల్లావాస్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఓడిపోయి టర్న్ నుంచి నిష్క్రమించారు. ఈ సీజన్ లో తమ తొలి మ్యాచ్ ను సెప్టెంబర్ 1న నెవిస్ పేట్రియాట్స్‌తో తలపడుతుంది.
సెయింట్ లూసియా కింగ్స్ స్క్వాడ్:
హెన్రిచ్ క్లాసెన్, ఫాఫ్ డు ప్లెసిస్, అల్జారీ జోసెఫ్, జాన్సన్ చార్లెస్, రోస్టన్ చేజ్, నూర్ అహ్మద్, డేవిడ్ వైస్, భానుక రాజపక్స, మాథ్యూ ఫోర్డ్, ఆరోన్ జోన్స్, ఖరీ పియరీ, ఖరీ కాంప్‌బెల్, జోహన్ జెరెమియా, షడ్రక్ డెస్కార్టే, మిక్కెల్ గ్రోవ్రియా, మెక్‌కెన్నీ క్లార్క్, అకీమ్ అగస్టే
Aaron Jones, the T20 World Cup sensation from the USA, has secured a CPL contract.
— CricTracker (@Cricketracker) July 15, 2024
The Caribbean Premier League 2024 season will begin on August 29th. pic.twitter.com/itZBHE5iqz