
సంపూర్ణేష్ బాబు, సంజోష్ హీరోలుగా నటించిన ‘సోదరా’చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమవుతోంది ఆరతి గుప్తా. మన్మోహన్ మేనంపల్లి దర్శకత్వంలో చంద్ర చగంలా నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 25న విడుదల కానుంది.
ఈ సందర్భంగా హీరోయిన్ ఆరతి గుప్తా మాట్లాడుతూ ‘ఇదొక లైట్ హార్టెడ్ ఫ్యామిలీ డ్రామా. ఇందులో అమాయకమైన పల్లెటూరి అమ్మాయిగా కనిపిస్తా. ఇన్నోసెంట్, డిగ్నిఫైడ్ క్యారెక్టర్ నాది. ఇది నా రియల్‌లైఫ్‌కు, వ్యక్తిత్వానికి దగ్గరగా ఉంటుంది. ఈ చిత్రం ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఇలా ప్రతి ఒక్కరితో కలిసి చూసేలా ఉంటుంది. సంపూ, సంజోష్‌లతో కలిసి నటించడం సంతోషంగా ఉంది.
దర్శకుడు మోహన్ పెర్‌ఫార్మ్ చేయడానికి స్కోప్ ఉన్న పాత్రను ఇచ్చారు. ఇక హైదరాబాద్‌లో ఏదో తెలియని ఎనర్జీ ఉంది. నేను ఇక్కడే బిజీ అవుతానని నమ్మకం ఉంది. నాకు అలియాభట్ అంటే ఇష్టం. ఆమె కెరీర్, తను పోషించిన పాత్రలు ఇన్‌స్పై ర్ చేశాయి. తెలుగులో అల్లు అర్జున్ గారు, ఆయన సినిమాలంటే ఇష్టం’అని ఆరతి గుప్తా చెప్పింది.