- చెన్నారం ఉపసర్పంచ్‌పై కేసు నమోదు
వర్ధన్నపేట, వెలుగు : వరంగల్ జిల్లా వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ పేరుతో ఇప్పటికే దమ్మన్నపేట, ఉప్పర్‌పల్లి గ్రామాల్లో బ్యాగులు, టిఫిన్ బాక్సులు, వాటర్ బాటిళ్లను ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకోగా, తాజాగా వర్ధన్నపేట మండలం చెన్నారంలో ఓ వ్యక్తి ఇంట్లో మరికొన్ని గిఫ్టులు బయటపడ్డాయి. బుధవారం ఎన్నికల స్పెషల్ స్క్వాడ్ తనిఖీ చేయగా ఓటర్లకు పంచడం కోసం ఉంచిన 25 టిఫిన్ బాక్సులు, 39 వాటర్ బాటిళ్లు, 15 బ్యాగులు దొరికాయి. అధికారులు వీటిని సీజ్ చేసి మామునూరు పోలీసులకు అప్పగించారు. ఎమ్మెల్యే పేరుతో ఉన్న గిఫ్టులను చెన్నారం ఉప సర్పంచ్ రాజమౌళి గౌడ్ తన ఇంట్లో పెట్టారని చెప్పడంతో పోలీసులు రాజమౌళి గౌడ్ పై కేసు నమోదు చేశారు.