తెలంగాణకు తొలి మెడల్‌‌‌‌

తెలంగాణకు తొలి మెడల్‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌, వెలుగు : ఉత్తరాఖండ్ నేషనల్ గేమ్స్‌‌‌‌లో తెలంగాణ పతకాల ఖాతా తెరిచింది. స్లైక్లిస్ట్ ఆశీర్వాద్ సక్సేనా కాంస్య పతకంతో మెరిశాడు. శుక్రవారం జరిగిన 120 కిలోమీటర్ల మెన్స్ రోడ్ రేస్ మాస్ స్టార్ట్ ఈవెంట్‌‌‌‌లో ఆశీర్వాద్‌‌‌‌ 2 గంటల 48 నిమిషాల 39.029సెకన్ల టైమింగ్‌‌‌‌తో మూడో స్థానం సాధించాడు. సర్వీసెస్‌‌‌‌కు చెందిన దినేశ్ కుమార్ (2:48:28.509 సె) గోల్డ్‌‌‌‌, సాహిల్ కుమార్ (2:48:28.730సె) సిల్వర్ నెగ్గాడు.