
హైదరాబాద్, వెలుగు: ఐటీసీకి చెందిన ఆశీర్వాద్ స్పైసెస్ ఆశీర్వాద్ మసాలా కారాన్ని కస్టమర్లకు పరిచయం చేసింది. ఇది ఇంట్లో తయారుచేసిన ఆహారం రుచిని ఇస్తుందని ప్రకటించింది. ఈ మసాలా కారాన్ని మిరపకాయ, వెల్లుల్లి, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకులతో తయారు చేశామని తెలిపింది. తెలుగు రాష్ట్రాల రైతుల నుంచే ఈ దినుసులను సేకరించామని తెలిపింది. ధరలు పరిమాణాన్ని బట్టి రూ.37 నుంచి రూ.150 వరకు ఉంటాయి.