- సీపీఐ (ఎంఎల్)న్యూడెమోక్రసి రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఆవునూరి మధు డిమాండ్
ఖమ్మం టౌన్,వెలుగు : బుగ్గపాడు ఆదివాసీలపై జరిగిన దాడికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఆవునూరి మధు డిమాండ్ చేశారు. సోమవారం ఖమ్మం నగరంలోని న్యూడెమోక్రసీ కార్యాలయంలోకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. సత్తుపల్లి మండలం బుగ్గపాడు,చంద్రా యపాలెంలో జరిగిన ఘటనకు కారణం, అటవీశాఖ అవలంబిస్తున్న విధానాలేనని అన్నారు.
వెంటనే ఘటనపై ప్రభుత్వం ఎంక్వయిరీ కమిటీ వేసి, పట్టాలున్న భూములను పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ ఇల్లందు డివిజన్ కార్యదర్శి తుపాకుల నాగేశ్వరరావు, అఖిలభారత రైతు కూలి సంఘం(ఏఐకేఎంఎస్) ఖమ్మం జిల్లా కార్యదర్శి వై.ప్రకాశ్, ప్రగతిశీల మహిళా సంఘం (పీఓ డబ్ల్యూయూ) ఖమ్మం జిల్లా కార్యదర్శి వై.జానకీ పాల్గొన్నారు.