'ఏబీ డివిలియర్స్' క్రికెట్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. 360 డిగ్రీ ఆటగాడిగా పేరొందిన ఏబీడికి భయపడని బౌలర్ లేడంటే అతిశయోక్తి కాదు. విధ్వంసకర బ్యాటింగ్‌కు, విలక్షణ షాట్లకు ఇతగాడు పెట్టింది పేరు. ఏబీడి బ్యాటింగ్ చేసే తీరు.. చూసే అభిమానులకు వ్యాయాయం చేసినట్లుగా ఉంటుంది. శరీరాన్ని విల్లులా వంచటం ఒక్క డివిలియర్స్‌కే సాధ్యం. అంతటి గొప్ప క్రికెటర్.
2018లో ఆటకు గుడ్ బై చెప్పిన ఈ దక్షిణాఫ్రికా మాజీ బ్యాటర్, తన క్రికెట్ ప్రయాణంలో పేస్ చేసిన కఠిన సమస్యలేంటో బయటకి వెల్లడించారు. 13 ఏళ్ల పాటు ఆరోగ్య సమస్యలతో పోరాడానని చెప్పిన ఏబీడి.. స్లీపింగ్ పిల్స్ లేనిదే నిద్రపోయేవాడిని కాదు అని తెలిపారు.
"మరుసటి రోజు ఏదైనా పెద్ద మ్యాచ్ ఉందంటే నాకు ముందురోజు రాత్రి నిద్రపట్టదు. ఆ సమయంలో స్లీపింగ్ పిల్స్ వేసుకుంటా. అది ఆరోగ్యానికి మంచిది కాదని నాకూ తెలుసు. కానీ తప్పేది కాదు. 2010 నుంచి 13 ఏళ్ల పాటు ఈ సమస్యతో పోరాడాను.." అని డివిలియర్స్ చెప్పుకొచ్చారు.
ఇక 2015 వన్డే ప్రపంచకప్‌లో వెస్టిండీస్‌పై డివిలియర్స్ విరుచుకుపడ్డ సంగతి తెలిసిందే. 66 బంతుల్లో ఏకంగా 162 పరుగులు చేశారు. ఈ ఇన్నింగ్స్ గురుంచి మాట్లాడిన ఏబీడి.. "2015 ప్రపంచకప్‌లో వెస్టిండీస్‌మ్యాచ్ రోజు నేను అస్వస్థతకు గురయ్యాను. ఒత్తిడి కారణంగా సరిగా నిద్రపోలేకపోయా. ఆరోజు ఉదయం 3:00 గంటల సమయంలో ఇంజెక్షన్లు కూడా తీసుకున్నా.." అని తెలిపారు.
ALSO READ :మిస్టరీ గర్ల్‌తో యువరాజ్ సింగ్.. ఎవరీమె?
యువతకు సందేశం
స్లీపింగ్ పిల్స్ వాడానని చెప్పిన ఏబీడి.. యువతరాన్ని మాత్రం ఆ పని చేయొద్దని కోరారు. అది వ్యసనానికి దారితీస్తుందని యువ తరానికి సలహా ఇచ్చాడు. కీలక మ్యాచ్ ఉన్నప్పుడు ఆటగాళ్లు నిద్రలేమితో భద్రపడటం ఇది తొలిసారి కాదు. ఎందరో ఆటగాళ్లు ఈ సమస్యను ఎదుర్కొన్నారు.