దక్షిణాఫ్రికా స్టార్ బ్యాటర్,మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ 2018లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కెరీర్ లో టాప్ లో ఉన్న ఉన్న ఈ సౌత్ ఆఫ్రికా విధ్వంసకర బ్యాటర్ 34 ఏళ్ళకే క్రికెట్ గుడ్ బై చెప్పడం ప్రపంచ క్రికెట్ ను ఆశ్చర్యపరించింది. డివిలియర్స్ మే 2018లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించినా.. ఆ తర్వాత రెండేళ్లు తన క్రికెట్ కెరీర్ కొనసాగించాడు. ఐపీఎల్ లో రాయల్ చాలెంజర్స్ తరపున ఆడిన ఏబీ..బిగ్ బాష్ లీగ్, కరీబియన్ ప్రీమియర్ లీగ్ లోను ఆడాడు. 2021 క్రికెట్ లో అన్ని రకాల క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు.
మూడేళ్ళ తర్వాత డివిలియర్స్ మళ్ళీ క్రికెట్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడని సమాచారం. ఇటీవలే ఆయన మెలిండా ఫారెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. " నాకు ఇంకా క్రికెట్ ఆడగలిగే సామర్ధ్యం ఉంది. నా పిల్లలు క్రికెట్ లో నా ఆటను చూడాలనుకుంటున్నారు. నాకు నెట్స్ లో ప్రాక్టీస్ చేయాలనిపిస్తుంది. మళ్ళీ క్రికెట్ లోకి వస్తానేమో. ఐపీఎల్, సౌతాఫ్రికా జట్టు తరపున ఆడే ఉద్దేశ్యం లేదు. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టం. ముందు వెళ్లి నా కన్ను చెక్ చేసుకోవాలి". అని డివిలియర్స్ అన్నాడు.
Also Read :- RCB జెర్సీని మహాకుంభమేళంలో ముంచిన అభిమాని
2018, ఫిబ్రవరిలో సౌతాఫ్రికా తరఫున చివరి అంతర్జాతీయ వన్డే మ్యాచ్ ఆడిన ఏబీడీ.. అదే ఏడాది ఏప్రిల్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో ప్రొటీస్ జట్టుకు ఆఖరుసారి ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్‌లో డివిలియర్స్ 5 వేలకు పైగా పరుగులు చేయడం విశేషం. ఇక అంతర్జాతీయ క్రికెట్ విషయానికొస్తే.. 114 టెస్టుల్లో 8,765 రన్స్, వన్డేల్లో 228 మ్యాచ్‌లు ఆడి 9,577 పరుగులు చేశాడు. ఇక టీ20 ల్లో 78 మ్యాచుల్లో 1,672 పరుగులు చేశాడు.
AB De Villiers hints at a comeback. 😍pic.twitter.com/d9GlxiqJGK
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 21, 2025