AB de Villiers: ఆల్ టైం టాప్-5 వన్డే బ్యాటర్లు ఎవరో చెప్పిన డివిలియర్స్

AB de Villiers: ఆల్ టైం టాప్-5 వన్డే బ్యాటర్లు ఎవరో చెప్పిన డివిలియర్స్

సౌతాఫ్రికా మాజీ కెప్టెన్.. విధ్వంసకర ఆటగాడు ఎబి డివిలియర్స్ వన్డే క్రికెట్ లో తన ఆల్ టైం టాప్ 5 బ్యాటర్స్ ఎవరో చెప్పాడు. ఈ లిస్ట్ లో ముగ్గురు భారత క్రికెటర్లతో పాటు.. ఆస్ట్రేలియా,సౌతాఫ్రికా నుంచి ఒక్కొక్కరిని ఎంపిక చేశాడు. సనత్ జయసూర్య, సౌరవ్ గంగూలీ, సంగక్కర, బ్రియాన్ లారా, రాహుల్ ద్రవిడ్, జయవర్ధనే లాంటి దిగ్గజ బ్యాటర్లను డివిలియర్స్ పట్టించుకోలేదు. డివిలియర్స్ టాప్ 5 ఆటగాళ్లెవరో ఇప్పుడు చూద్దాం.

రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా):

పాంటింగ్ ఆస్ట్రేలియా వన్డే జట్టును కెప్టెన్ గా, బ్యాటర్ గా అద్భుతంగా నడిపించాడు. 1999 వరల్డ్ కప్ గెలిచిన జట్టులో పాంటింగ్ సభ్యుడిగా ఆన్నాడు. ఇక పాంటింగ్ కెప్టెన్సీలో ఆస్ట్రేలియా 2003, 2007 వన్డే ప్రపంచ కప్ లను గెలుచుకుంది. బ్యాటర్ గా 375 వన్డేల్లో పాంటింగ్ 13704 పరుగులు చేశాడు. వీటిలో 30 సెంచరీలు.. 82 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 

జాక్వెస్ కల్లిస్‌ (సౌతాఫ్రికా):

సౌతాఫ్రికా ఆల్ టైం బెస్ట్ ఆల్ రౌండర్ జాక్వెస్ కల్లిస్‌ ప్రపంచంలో ఆల్ టైం బెస్ట్ క్రికెటర్లలో ఒకడు. 1998  సౌతాఫ్రికా ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. 328 వన్డేల్లో 44 యావరేజ్ తో 11579 పరుగులు చేశాడు. 17 సెంచరీలతో పాటు ఏకంగా 86 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.    

మహేంద్ర సింగ్ ధోనీ (ఇండియా):

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సారధ్యంలో భారత క్రికెట్ జట్టు వరల్డ్ కప్ తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకుంది. వన్డేల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫినిషర్ గా పేరు తెచ్చుకున్నాడు. 350 వన్డేల్లో 50 యావరేజ్ తో 10773 పరుగులు చేశాడు. వీటిలో 10 సెంచరీలతో పాటు 73 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 

ALSO READ : Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ.. టైటిల్ విజేత, రన్నరప్‌కు ప్రైజ్ మనీ ఎంతంటే..?

సచిన్ టెండూల్కర్ (ఇండియా)

క్రికెట్ గాడ్.. ఆల్ టైం బెస్ట్ బ్యాటర్ గా సచిన్ టెండూల్కర్ కు పేరుంది. కానీ సెహ్వాగ్ ను సచిన్ 2వ స్థానానికి పరిమితం చేశాడు. వన్డే చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా సచిన్ ఇప్పటికీ టాప్ లో కొనసాగుతున్నాడు. ఓవరాల్ గా దిగ్గజ టెండూల్కర్ 463 వన్డేల్లో 18,426 పరుగులు చేశాడు. వీటిలో 49 సెంచరీలు ఉన్నాయి. వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించిన తొలి క్రికెటర్ కూడా సచిన్ కావడం విశేషం. 

విరాట్ కోహ్లీ (ఇండియా)

కోహ్లీ అత్యంత నిలకడ.. మ్యాచ్ విన్నింగ్ సామర్థ్యాన్ని గుర్తించి టాప్ ర్యాంక్ ఇచ్చాడు. వన్డేల్లో కోహ్లీ టాప్ బ్యాటర్ గా పేరు తెచ్చుకున్నాడు. దశాబ్ద కాలంగా భారత బ్యాటింగ్ లైనప్‌కు మూలస్తంభంగా ఉన్న కోహ్లీ.. 58 సగటుతో దాదాపు 14 వేల పరుగులను సాధించాడు. 50 సెంచరీలతో వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్ గా చరిత్ర సృష్టించాడు.