ఆంధ్ర ఇంటలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వర్లు బదిలీ

లోక్ సభ ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్ లో మరో కీలక పరిణామం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఇంటలిజెన్స్ డీజీపీ ఏబీ వేంకటేశ్వర్లు బదిలీ అయ్యారు. హైకోర్టు ఆదేశాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వెంటనే ఏపీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో రిపోర్ట్ చేయాలని ఆయనకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.

ఇంటలిజెన్స్ డీజీపీ ఏబీ వేంకటేశ్వర్లు బదిలీ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ RP ఠాకూర్ కు కూడా పలు ఆదేశాలు అందాయి. ఏబీ వెంకటేశ్వర్లుకు ఎన్నికలకు సంబంధించిన ఎటువంటి పనులు అప్పగించొద్దని డీజీపీ ఠాకూర్ కు హయ్యర్ అథారిటీ డైరెక్షన్స్ ఇచ్చింది. లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు ముగిసే వరకు ఈ ఆదేశాలు పాటించాలని సూచించింది.

కడప, శ్రీకాకుళం జిల్లాల ఎస్పీలతో పాటు… నిఘా డీజీ ఏబీ వెంకటేశ్వర్లును బదిలీ చేస్తూ ఇటీవల ఈసీ ఆదేశాలు ఇచ్చింది. ఐతే… ఏబీ వెంకటేశ్వర్లు బదిలీపై ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం హైకోర్టు కు వెళ్లింది. అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తామని మంత్రులు చెప్పారు. ఐతే.. హైకోర్టు ఆదేశాలతో… ఈసీ నిర్ణయాన్ని అమలుచేసేందుకు ఏపీ ప్రభుత్వం చివరకు అంగీకరించింది.