25 ఏళ్ల క్రితం కంటి చూపు లేకుండా చెత్తకుప్పలో దొరికింది: ఆమె తలరాతని తానే రాసుకుంది

25 ఏళ్ల క్రితం కంటి చూపు లేకుండా చెత్తకుప్పలో దొరికింది: ఆమె తలరాతని తానే రాసుకుంది

విధి ముందు తల వంచలేదు ఆ యువతి. లోపాన్ని సైతం లెక్కచేయలేదు, కన్నతల్లిదండ్రులే పుట్టగానే వద్దనుకున్నారు.. కానీ ఆమె చివరికి అందరి చూపు తనవైపు తిప్పుకుంది. 25 ఏళ్ల క్రితం పుట్టుకతోనే కంటి చూపు లేదని కన్నవారే చెత్తకుప్పలో పడేశారు. ఆ అమ్మాయే ఇప్పుడు మహారాష్ట్ర పబ్లిక్  సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ క్లియర్ చేసి ముంభై సెక్రటేరియట్‌లో క్లర్క్ కం టైపిస్ట్ జాబ్ కొట్టింది. తన తలరాతను తానే రాసుకుంది.. ఆమె పేరే మాలా పాపల్కర్.

మహారాష్ట్రంలోని జల్గావ్ రైల్వే స్టేషన్ లో 25 ఏళ్ల క్రితం చెత్త కుప్పలో ఓ చిన్నారు కనిపించింది. ఆ పాప పుట్టికతోనే అంధురాలు. ఆ చిన్నారిని జల్గావ్ లోని రిమాండ్ హోమ్ కు తరలించారు. అక్కడి నుంచి 270 కిలోమీటర్ల దూరం ఉన్న  అంధుల అనాథాశ్రమంలో చేర్చారు. అక్కడే అమ్మాయి బ్రెయిలీ లిపిలో చదువుకుంది. పద్మ శ్రీ అవార్డ్ గ్రహిత శంకర్ బాబా పాపల్కర్(81) ఆ చిన్నారికి తన ఇంటి పేరుతో నామకరణం చేశాడు. 

బ్రెయిలీ లిపిలో చదువు చెప్పించాడు. తాజాగా మే 16న విడుదలైన మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (MPSC) ఫలితాల్లో మాలా ర్యాంక్ సాధించింది. ముంభై సెక్రటేరియట్ లో క్లర్క్ కం టైపిస్ట్ జాబ్ సాధించింది. నన్న రక్షించి, ఈ రోజు ఈ పరిస్థితికి తీసుకురావడానికే దేవుడు ఈ అనాథాశ్రమం వాళ్లను పంపించాడని, ఇక్కడితో తాను ఆగనని యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతానని IAS అవడమే తన లక్ష్యమని మాలా చెప్తుతోంది.