వింత విలేజ్​లు : ఇసుకలో.. చెట్లల్లో ఇళ్లు..!

వింత విలేజ్​లు : ఇసుకలో.. చెట్లల్లో ఇళ్లు..!

అనగనగా ఓ ఊరు. అందులో కొన్ని ఇళ్లున్నాయి. ఏ ఇంట్లోనూ పిట్ట పురుగు ఉండవు.  ఇసుక మాత్రం భారీగా మేట వేసి పెద్ద ఎడారిని గుర్తుకు తెస్తుంది. దుబాయ్​లో ఉందిది. అనగనగా మరో ఊరు. అక్కడ మనుషుల కన్నా ఇళ్లే ఎక్కువ. ప్రతి ఇల్లూ పచ్చని పొదరిల్లులా కనిపిస్తుంది. ఊరంతా అడవిని తలపిస్తుంది. చైనాలో ఉంది ఈ పచ్చటి పల్లెటూరు. ప్రపంచమన్న తర్వాత కోట్ల సంఖ్యలో ఊళ్లుంటాయి. అలాంటప్పుడు ఈ రెండింటి గురించే తెలుసుకోవటం ఎందుకనే డౌట్​ రావొచ్చు. కానీ, ఈ పల్లెలు ప్రత్యేకం. అక్కడి వాతావరణాలు పూర్తిగా భిన్నం. ఇంటర్నెట్​ పుణ్యమాని ప్రపంచం ఒక చిన్న గ్రామంగా మారిపోవటం వల్ల ఈ గ్రామాల ఫొటోలు అందరికీ చేరుతున్నాయి. దీంతో టూరిస్టులు ఆ ఊళ్లను చూడటానికి క్యూ కడుతున్నారు. ఒక ఊరు పేరు ‘అల్​ మదామ్’​ కాగా, మరో ఊరు పేరు ‘హౌటౌవాన్’​.

‘అల్​ మదామ్​’ ఊరుని దుబాయ్​ సిటీ నుంచి షార్జాకి వెళ్లే దారిలో బోర్డర్​ పక్కన చూడొచ్చు. పేరెంత వెరైటీగా ఉందో… ఊరు అంతే విచిత్రంగా అనిపిస్తుంది. ప్రతి ఇల్లూ ఇసుకతో నిండిపోయింది. కిటికీలు, దర్వాజాల నుంచి ఇంట్లోకి  అలల మాదిరిగా ఇసుక కొట్టుకొచ్చినట్లు, సామాన్లని బయటికి నెట్టుకొచ్చినట్లు కనిపిస్తుంది. ఊళ్లోని ఇళ్లు రెండు వరుసల్లో ఉంటాయి. వాటి మధ్యలో రోడ్డు. ఇళ్లకు కొద్ది దూరంలో కనిపించే మసీదు.. విధి ఆ ఊరును ఎలా వెక్కిరించిందో చెప్పటానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది.

దెయ్యం తరిమేసిందా?

అల్​ మదామ్​ ఊరిలో ఏ ఇంటికీ తలుపు లేదు. ఒక్క ఇంటికీ కిటికీ కనిపించదు. ఒక వేళ ఉన్నా వాటిని మూసిన పాపాన పోలేదు. ఏదో కనిపించని శక్తి జనాన్ని ఇళ్లల్లో నుంచి తరిమితే… వాళ్లు భయంతో పరుగులు తీసినట్లు జాడలున్నాయి. థ్రిల్​​​ కావాలనుకునే విజిటర్లు అల్​ మదామ్​ విలేజ్​కి పెద్ద సంఖ్యలో వచ్చి చూసిపోతున్నారు. ఆ ఫీలింగ్​ని తెగ ఎంజాయ్​ చేస్తున్నారు.

యూట్యూబర్లు ఈ సైట్​లో తమ అడ్వెంచర్లను షూట్​ చేసుకొని తీసుకుపోతున్నారు. శాండ్​ ఫొటోషూట్​కోసం మోడల్స్​ని తెస్తున్నారు. ఈ ప్రాంతానికి ట్రిప్పులు నడపడానికి టూర్​ ఆపరేటర్లు ముచ్చట పడుతున్నారు. అసలు అక్కడ ఏం జరిగి ఉంటుందా అని తెలుసుకోవటానికి రీసెర్చర్లు దీన్నొక ఫేవరేట్​ స్పాట్​లా భావిస్తున్నారు. మొత్తానికి ఇది ‘అంతుచిక్కని విషయానికి అడ్రస్​’లా తయారైంది. ‘జనం లేకపోవటమే ఈ ఊరికి అందం’ అని బ్రిటిష్​ ట్రావెల్​ బ్లాగర్​ వానెస్సా బాల్​ అభిప్రాయపడ్డారు.

సొమ్ము చేసుకోవట్లేదు

అల్​ మదామ్​ ఊరును చూడటానికి అన్ని ప్రాంతాల నుంచి పబ్లిక్​ వస్తుంటారు. దాన్నో టూరిస్ట్​ ప్లేస్​లా డెవలప్​ చేద్దామనే ఆలోచన మాత్రం లోకల్​ ఆఫీసర్లకు రావట్లేదు. పాపులారిటీని పైసల రూపంలోకి మార్చుకోవాలనే ఆసక్తి దుబాయ్​ ప్రభుత్వానికీ లేనట్లు కనిపిస్తోంది. అలా అని అక్కడికి వెళ్లేవాళ్లను ఆపే ప్రయత్నమూ చేయట్లేదు. ఆ గ్రామం ఎందుకలా ఎడారి అయిందో చెప్పే సరైన సమాచారం ఎవరి దగ్గరా లేదు. విలేజ్​ హిస్టరీని వెలికి తీయటానికి షార్జా ఆర్ట్​ ఫౌండేషన్​ 2018లో ఒక ప్రయత్నం చేసింది. పబ్లిక్​ కన్సల్టేషన్​ని నిర్వహించింది.

ఆ కార్యక్రమంలో పాల్గొన్నవాళ్లు ఈ ఊరుని 1970ల్లో కట్టినట్లు చెప్పారు. ఇసుక తుఫాన్ల వల్ల గ్రామస్తులు ఇళ్లు వదిలిపోయారన్నారు. అయితే1960ల్లో యూఏఈ సర్కారు ఆయిల్​ రిజర్వ్​లను గుర్తించాక ఎడారుల్లో బతికే సంచార జాతులకు సిటీల్లో మోడ్రన్​ పబ్లిక్​ హౌసింగ్​ ప్రోగ్రామ్​ అమలు చేసిందని, ఇక్కడివాళ్లు నగరాలకు తరలినట్లు కొలంబియా యూనివర్సిటీ రీసెర్చర్లు వివరించారు. నీళ్లు, కరెంట్​ సౌకర్యాల్లేకే వలసబాట పట్టారని అంటున్నారు. నిజమేంటో దేవుడికే తెలియాలి. ఈ పల్లెటూరు తూర్పు షాంఘై (చైనా)లోని షెంగ్​షాన్​ ఐలాండ్​లో ఉంది. ఇక్కడ ఒకప్పుడు రెండు వేలకు పైగా జాలర్ల కుటుంబాలు ఉండేవి. ఇప్పుడు పట్టుమని పది మంది కూడా లేరు. ఊరు అందాలను ఆస్వాదించటానికి మాత్రం వందల సంఖ్యలో పబ్లిక్​ వస్తున్నారు. హౌటౌవన్ విలేజ్​లోకి ఎంటరవగానే అక్కడి గ్రీనరీని చూడటానికి రెండు కళ్లూ చాలవు. 1950ల్లో ఏర్పడ్డ ఈ గ్రామంలో ఎడ్యుకేషన్​, ఆహార సదుపాయాలు సరిగా లేక జనం 1990ల్లో తమ దారి తాము చూసుకున్నారనే టాక్​ వినిపిస్తోంది.

పుట్టిన కొత్తలో ఈ ఊరు జనంతో కళకళలాడేది. పొద్దు పొడిచింది మొదలు. అలా బీచ్​లోకి వెళ్లి ఇలా సీఫుడ్డు తెచ్చుకొని, అమ్మి పొట్టపోసుకునేవారు. రాను రానూ ఈ తీర ప్రాంతానికి పెద్ద పెద్ద పడవలు రావటం మొదలైంది. దీంతో లోకల్​ జాలర్లు వేటకు వెళ్లి తెచ్చే చేపలు ఏ మూలకూ సరిపోయేవి కాదు.  ఫలితంగా స్థానికులకు ఉపాధి కరువై పర్మనెంట్​గా పక్క పట్టణాలకు చేరారు. క్రమంగా విలేజ్​ బోసిపోయింది. ఇళ్లను అలాగే ఒదిలేయడంతో మెయింటెనెన్స్​ లేక చుట్టూ చెట్లూ పెరిగిపోయాయి. ఇప్పుడు సెల్ఫీలు దిగే వాళ్లే అడుగడుగునా కనిపిస్తున్నారు.

లక్ష డాలర్ల రెవెన్యూ

టూరిస్టుల రాక రోజురోజుకీ పెరుగుతుండటంతో లోకల్​ ఆఫీసర్లు ఫీజు వసూలు చేయటం మొదలుపెట్టారు. ఊళ్లోకి వెళ్లి మొత్తం చూడాలనుకునేవారు రోజుకి 8 డాలర్లు చెల్లించాలి. దూరంగా ఉండి ఓవర్​వ్యూని చూడాలనుకుంటే 3 డాలర్లు ఇస్తే చాలు. ఈ విధంగా వచ్చే ఆదాయం 2017లో లక్ష డాలర్లు చేరటం విశేషం. షాంఘై నుంచి దాదాపు 40 మైళ్ల దూరంలో ఉండే ఈ ఏరియాను చూడటానికి ఎండాకాలం సరైన సమయం. అయితే.. ఖాళీగా ఉన్న ఇళ్లలోకి వెళ్లటం మాత్రం ప్రమాదకరం. ఎంతోకాలంగా ఎవరూ లేకపోవడంవల్ల మెయింటెనెన్స్​ లేదు. చాలా ఇళ్లు చెట్లు, తీగల బరువుతో ఉన్నాయి. దాదాపుగా అన్ని ఇళ్ల గోడల్లోకి వేర్లు చొచ్చుకుపోయాయి. అవి ఏ క్షణాన్నయినా కూలిపోవచ్చని లోకల్​ సిబ్బంది హెచ్చరిస్తుంటారు.

see also: సరోగసి కాదు.. సహజీవనం చేద్దమన్నడు

చాక్లెట్లు, పానీపూరి ఆశచూపి.. బాలికపై అత్యాచారం