Usman Qadir: 31 ఏళ్లకే వీడ్కోలు.. అంతర్జాతీయ క్రికెట్‌కు పాక్ స్పిన్నర్ రిటైర్మెంట్

Usman Qadir: 31 ఏళ్లకే వీడ్కోలు.. అంతర్జాతీయ క్రికెట్‌కు పాక్ స్పిన్నర్ రిటైర్మెంట్

పాకిస్థాన్ లెగ్ స్పిన్నర్ ఉస్మాన్ ఖాదిర్ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. గురువారం (అక్టోబర్ 3) అతను సోషల్ మీడియా వేదికగా తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు. 31 ఏళ్ల అతను తన ప్రయాణంలో సహకరించిన కోచ్‌లు, సహచరులకు సోషల్ మీడియా పోస్ట్‌లో ధన్యవాదాలు తెలిపాడు. పాకిస్థాన్ దిగ్గజ ఆటగాడు కొడుకుగా క్రికెట్ లో ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చాడు. అయితే పాకిస్థాన్ తరపున పెద్దగా రాణించలేదు. ప్రస్తుతం అతనికి జట్టులో చోటు కూడా లభించడం లేదు. దీంతో అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. 

పాకిస్థాన్ తరపున ఉస్మాన్ ఖాదిర్ మొత్తం 25 టీ20 మ్యాచ్ లు ఒక వన్డే ఆడాడు. టీ20ల్లో 30 వికెట్లు.. వన్డేల్లో ఒక వికెట్ పడగొట్టాడు.   అతనికి ఇప్పటివరకు టెస్ట్ జట్టులో చోటు లభించలేదు. మూడు సంవత్సరాలుగా వన్డే జట్టులో స్థానం లభించలేదు. గత సంవత్సరం టీ20 మ్యాచ్ ల్లో సైతం అతనికి అవకాశం రాలేదు. ఖాదిర్ ప్రయాణం 2010లో ఆసియా క్రీడలలో పాకిస్థాన్‌కు అరంగేట్రం చేయడంతో ప్రారంభమైంది. సెప్టెంబరు 2018లో ఉస్మాన్ బిగ్ బాష్ లీగ్‌లో పెర్త్ స్కార్చర్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. 

ALSO READ | ENG v WI 2024: పవర్ హిట్టర్ల మధ్య పోరు: వెస్టిండీస్‌తో వన్డే, టీ20లకు ఇంగ్లాండ్ జట్టు ప్రకటన

"పాకిస్తాన్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాను. ఈ అద్భుతమైన ప్రయాణానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియ జేయాలనుకుంటున్నాను. నా దేశానికి ప్రాతినిధ్యం వహించడం గొప్ప గౌరవం. నా మద్దతుగా నిలిచిన వారికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను." అని ఖాదిర్ ట్వీట్ చేశాడు.