భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచ కప్ లో దాయాది పాకిస్తాన్ జట్టు పేలవ ప్రదర్శన కనపరిచిన విషయం తెలిసిందే. లీగ్ దశలో తొమ్మిదింటిలో ఐదింట ఓడిన బాబర్ సేన.. సెమీస్ కు కూడా అర్హత సాధించలేకపోయింది. చివరకు వారు వట్టి చేతులతో స్వదేశానికి చేరుకున్నారు. పాక్ జట్టు చేసిన ఈ ప్రదర్శనపై ఆ దేశ మాజీ క్రికెటర్లు విశ్లేషణలు మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఆ జట్టు మాజీ ఆల్ రౌండర్ అబ్దుల్ రజాక్.. భారత నటి ఐశ్వర్య రాయ్‌ని కించపరుస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
కరాచీలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న అబ్దుల్ రజాక్.. పాక్ ప్రదర్శనను మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్‌తో పోలుస్తూ కించపరిచేలా వ్యాఖ్యానించాడు. కెప్టెన్.. ఎప్పుడూ జట్టులోని ఇతర ఆటగాళ్లలో స్ఫూర్తినింపేలా ఉండాలి. తాను జాతీయ జట్టులో ఆడే సమయంలో యూనిస్ ఖాన్.. అలానే ప్రోత్సహించేవారు. కానీ, ఇప్పుడు జట్టులో అలాంటి వాతావరణం కనిపించడం లేదు. ఎవరికి వారు అన్నట్లుగా ఉంటూ మెరుగైన ప్రదర్శన రావాలంటే సాధ్యమవ్వదు. ఉదాహరణకు ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్‌ని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటే మంచిదే.. కానీ, పవిత్రమైన పిల్లలు పుట్టాలని కోరుకోవడం తప్పు అవుతుంది. అది ఎప్పటికీ జరగదు.." అంటూ పిచ్చి కూతలు కూశాడు. అదే సమయంలో అతని పక్కనే కూర్చొని ఉన్న ఆ దేశ మాజీ క్రికెటర్లు షాహీద్ ఆఫ్రిదీ, ఉమర్ గుల్.. అతని వాగుడును సమర్ధిస్తూ నవ్వుతూ చప్పట్లు కొట్టారు.
Shameful example given by Abdul Razzaq. #AbdulRazzaq #CWC23 pic.twitter.com/AOboOVHoQU
— Shaharyar Ejaz ? (@SharyOfficial) November 13, 2023
అబ్దుల్ రజాక్ చేసిన వ్యాఖ్యలపై భారత క్రికెట్ అభిమానులు భగ్గుమంటున్నారు. తరాలు మారుతున్నా పాకిస్తాన్ క్రికెటర్లు బుద్ధి మాత్రం మారడం లేదని లేదని విమర్శిస్తున్నారు. అబ్దుల్ రజాక్ బేషరతుగా ఐశ్వర్య రాయ్‌కి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
Car driver of Aishwarya Rai looks more handsome than Abdul Razzaq .pic.twitter.com/336lQyUPKQ
— Sunil the Cricketer (@1sInto2s) November 13, 2023