హైదరాబాద్ సాలార్జంగ్​ భూములు ఎవరూ కొనొద్దు

  • సాలార్జంగ్ వారసుడు, బావమరిది అబ్దుల్​ వాహెబ్

ఖైరతాబాద్​,వెలుగు: ప్రభుత్వ ఆధీనంలోని సాలార్జంగ్ భూమిని కొందరు కబ్జా చేసి ప్లాట్లుగా అమ్ముతున్నారని, ఆ భూముల వారసుడు సాలార్జంగ్ బావమరిది అబ్దుల్​వాహెబ్​స్పష్టంచేశారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. “ సాలార్జంగ్ కు పెండ్లి కాలేదు. ఆయనకు వారసులు లేరు. అతని భూములను  ఎవరు అమ్మారు. ఇతరులకు ఎలా అమ్ముతున్నారు. 

మీకు హక్కు ఎలా ఉంటుంది..? అని  అబ్దుల్​వాహెబ్​ప్రశ్నించారు. మొత్తం 362.15 కుంటల భూమి 2013లో కబ్జా అయిందని, గత ప్రభుత్వంలో మంత్రి మల్లారెడ్డి సపోర్ట్ తో చాలా భూమి ఆక్రమణకు గురైందని తెలిపారు.  అట్టి భూమి ఎవరు కొన్నా.. అమ్మినా లావాదేవీలు చెల్లవని స్పష్టం చేశారు.  ఫేక్ డాక్యుమెంట్లను సృష్టించి సుఖేందర్​రెడ్డి, శశిధర్​రెడ్డి ప్లాట్లుగా అమ్ముతున్నారని ఆరోపించారాఉ. మేడ్చేల్​జిల్లా కంచె పర్వతాపూర్​లోని సర్వే నంబర్లను సృష్టించి అమ్మకాలు సాగిస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని చెప్పారు.  ఈ సమావేంలో బొల్గం లక్ష్మణ్​ పాల్గొన్నారు.