AUS vs PAK: సూరీడు ఎంత పని చేసాడు: సింపుల్ క్యాచ్‌ను వదిలేసిన పాక్ ఫీల్డర్

AUS vs PAK: సూరీడు ఎంత పని చేసాడు: సింపుల్ క్యాచ్‌ను వదిలేసిన పాక్ ఫీల్డర్

పాక్ ఫీల్డింగ్ విన్యాసాల గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. బ్యాటింగ్, బౌలింగ్ పర్వాలేదనిపించినా ఫీల్డింగ్ మాత్రం కనీస స్థాయిలో ఉండదు. ఇప్పటికే వీరి చెత్త ఫీల్డింగ్ తో విమర్శలు మూటకట్టుకున్నారు. ఇక క్యాచ్ వదిలేసిన తర్వాత ఒకరినొకరు తిట్టుకుంటూ గల్లీ క్రికెట్ ను గుర్తు చేస్తారు. తాజాగా అలాంటి ఒక ఈజీ క్యాచ్ పాక్ ఫీల్డర్ అబ్దుల్లా షఫీక్ జారవిడిచాడు. అయితే ఈ సారి వీరి పేలవ ఫీల్డింగ్ ను సూర్యుడు కవర్ చేసాడు.

ఆస్ట్రేలియా, పాకిస్థాన్ జట్ల మధ్య మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా తొలి టెస్టు పెర్త్ వేదికగా జరుగుతుంది. ఈ మ్యాచ్ లో ఆసీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోగా.. ఆసీస్ ఓపెనర్లు మంది స్టార్ట్ ఇచ్చారు. తొలి వికెట్ కు ఏకంగా 126 పరుగులు జోడించి కంగారులను పటిష్ట స్థితిలో నిలిపారు. ఇదిలా ఉండగా ఈ మ్యాచ్ లో తొలి వికెట్ తీయడానికి పాకిస్థాన్ మంచి అవకాశం వచ్చింది. 16 ఓవర్ తొలి బంతిని ఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా పుల్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. పాక్ పేస్ బౌలర్ అమీర్ జమాల్  వేసిన ఈ బంతి మిస్ అయ్యి సెకండ్ స్లిప్ వైపు పైకి లేచింది.
 
గాల్లోకి లేచిన ఈ క్యాచ్ ను అందుకునే క్రమంలో అబ్దుల్లా షఫీక్ మిస్ చేసాడు. ఆస్ట్రేలియాలో విపరీతమైన ఎండ కారణంగా షఫిక్ ఏం చేసాడో అర్ధం కాలేదు. సూర్యుడు దెబ్బకు బాల్ ను అంచనా వేయలేక చేతిలోకి వచ్చిన క్యాచ్ ను మిస్ చేసాడు. ఈ సమయంలో ఖవాజా 21 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తన్నాడు. టెస్టు విషయానికి వస్తే 40 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. స్మిత్(4) వార్నర్ (95) క్రీజ్ లో ఉన్నారు. ఖవాజా 41 పరుగులు, లబుషేన్ 10 పరుగులు చేసి ఔటయ్యారు.